Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్-4: వామ్మో గంగవ్వకు కోపం వచ్చింది.. కొట్టడానికి కుర్చీనెత్తిందే..! (Video)

Advertiesment
బిగ్ బాస్-4: వామ్మో గంగవ్వకు కోపం వచ్చింది.. కొట్టడానికి కుర్చీనెత్తిందే..! (Video)
, గురువారం, 24 సెప్టెంబరు 2020 (15:36 IST)
gangavva
అవును.. బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ జరుగుతోంది. రోబోలు వర్సెస్ మనుషులు అనే టాస్క్.. హౌస్ మెంబర్స్ మధ్య బాగానే చిచ్చు పెట్టింది. ఈ టాస్కులో భాగంగా హౌస్ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంతవరకు వచ్చింది. కాగా బిగ్ బాస్ సీజన్ 4 మొదలయ్యి అప్పుడే రెండు వారాలు గడిచాయి. మొదటి వారంతో పోలిస్తే ఈ వారంలో దాదాపు అందరు కంటెస్టెంట్స్ ఓపెన్ అప్ అయ్యారు. 
 
కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌లో మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ కంటెస్టెంట్స్‌గా పాల్గొంటున్నారు. 
 
అంతేకాకుండా ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి, జబర్దస్త్ ఫేమ్ అవినాష్ బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారంలో సూర్య కిరణ్ ఎలిమినేట్ అవ్వగా, రెండవ వారం నామినేషన్స్‌లో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు.
 
శనివారం నాడు ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి స్టేజ్ మీద మాట్లాడారు. ఈ వారం ఎవరైనా ఒక కంటెస్టెంట్‌ని నామినేట్ చేయడం అనే బిగ్ బాంబ్ కరాటే కళ్యాణికి ఇచ్చి ఆ బిగ్ బాంబ్ ఎవరి మీద వేస్తారు అని అడిగితే దేవి నాగవల్లి అని చెప్పారు కరాటే కళ్యాణి. తర్వాత కరాటే కళ్యాణి వెళ్లిపోయారు. 
 
కంటెస్టెంట్స్ అందరూ డాగ్ ఎండ్ ది బోన్ గేమ్ ఆడారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని ముందే చెప్పారు కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఇంకొక కంటెస్టెంట్ అలేఖ్య హారిక అని చెప్పారు నాగార్జున. ఎలిమినేట్ అవ్వడంతో అలేఖ్య హారిక హౌస్‌లో నుండి బయటికి రావడానికి సిద్ధమయ్యారు. బయటికి వచ్చే సమయానికి మళ్ళీ వెనక్కి పిలిచి ఇది ఫేక్ ఎలిమినేషన్ అని, సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం ఎంత తప్పో తెలియాలి అని ఇలా చేశానని చెప్పారు నాగార్జున. తాజాగా విడుదలైన ప్రోమోలో మోనాల్ ఓవరాక్షన్ చేసినట్లు కనిపించింది. 
 
మోనాల్ మోటార్ స్విచ్ ఆన్ చేయొద్దు అని సభ్యులు చెప్తున్నా.. స్విచ్ఛ్‌ను మోనాల్ టచ్ చేసింది. మరో టీమ్ కంటిస్టెంట్‌పై మోనాల్ అరవడం చేసింది. ఈ క్రమంలో మోనాల్‌-మరో హౌస్ మేట్ మధ్య తోసుకోవడం.. ఇద్దరూ పడటం వంటివి జరిగాయి. ఇదంతా చూసిన గంగవ్వకు ఒక్కసారిగా కోపం వచ్చింది. అంతే మోనాల్‌పై కోపంతో ఎగిరిపడింది. చెంపమీద కొట్టింది.. కొట్టేందుకు కుర్చీనెత్తింది. అంతే మోనాల్ సైలెంట్‌గా చూస్తుండిపోయింది. ఈ వ్యవహారానికి సంబంధిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్‌తో అనుకున్న త్రివిక్రమ్ చిన్న సినిమా చేస్తున్నాడా..?