Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ నాకు సారీ చెప్పాలి... లేకుంటే వెళ్ళిపోతా..? ఎవరు?

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (11:42 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి కంటెస్టెంట్స్ అల్లరితో, గొడవలతో, రొమాంటిక్ సన్నివేశాలతో, అదరగొట్టే డ్యాన్స్‌లతో బోలెడంత వినోదాన్ని పంచుతూ మొదటి వారం అన్ని చానెల్స్ కంటే, అన్ని ప్రోగ్రామ్స్ కంటే ఎక్కువగా 18.5 అత్యధిక టిఆర్పి తెచ్చుకుంది. బిగ్ బాస్ షో మొదలై రెండు వారాలు కావొస్తోంది. 
 
మొదటి వారం డైరెక్టర్ సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు రెండో ఎలిమినేషన్‌కి నామినేషన్ పూర్తయ్యింది. మరి ప్రేక్షకులు వేసే ఓటింగ్ తో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇప్పటికే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కమెడియన్స్ పవన్ సాయి, జబర్దస్త్ అవినాష్‌లు కూడా షోలో భాగమయ్యారు. 
 
మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న గంగవ్వ తనకు ఆరోగ్యం బాగోలేదని, నన్ను ఇంటికి పంపించండి అని బిగ్ బాస్‌కి చెప్పింది. ప్రస్తుతం గంగవ్వని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మరి గంగవ్వ బిగ్ బాస్‌లో కొనసాగడానికి ఒప్పుకుంటుందా లేదా అని ఆమె అభిమానులు, బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
తాజాగా మరో కంటెస్టెంట్‌ నోయల్ కూడా బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతా అంటున్నాడు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో తెలుగులో మాట్లాడటం లేదని, టైమ్‌ను పాటించలేదని బిగ్ బాస్ నోయల్‌కి పనిష్మెంట్ ఇచ్చింది. దీనికి సీరియస్ అయిన నోయల్ బిగ్ బాస్ వచ్చి తనకు సారీ చెప్పాలని సీరియస్ అయ్యాడు. 
 
తాను ప్రకృతి లాంటోడిని అని, ఎంత మంచిగా ఉంటుందో అంతే చెడ్డగా కూడా ఉంటుందని, వాళ్లు తనను కెలికారని, తానేంటో చూపిస్తా బస్తీ మే సవాల్ అని అన్నాడు నోయల్. మళ్ళీ వెంటనే తాను ఈ శనివారం వెళ్లిపోవడానికి డిసైడ్ అయ్యాను. తనకు ఈ బిగ్ బాస్ హౌస్ వద్దు, నాగార్జున సార్‌కి చెప్పి వెళిపోతా అంటూ ఫైర్ అవుతున్నాడు నోయల్. మరి ఇవాళ్టి ఎపిసోడ్ చూస్తే కానీ నోయల్, గంగవ్వ విషయంలో ఏం జరుగుతుందో తెలియదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరెస్టు చేస్తామంటే ఆత్మహత్య చేసుకుంటాం : లేడీ అఘోరి - వర్షిణి (Video)

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఏపీ వాసుల దుర్మరణం

గుడ్ ఫ్రైడే : క్రైస్తవ పాస్టర్లకు శుభవార్త.. గౌరవ వేతనం రూ.30 కోట్లు విడుదల

భార్యల వివాహేతర సంబంధాలతో 34 రోజుల్లో 12 మంది భర్తలు హత్య, ఎక్కడ?

తితిదే ఈవో బంగ్లాలో దూరిన పాము - పట్టుకుని సంచెలో వేస్తుండగా కాటేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments