Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సినిమా విషయంలో అసలు విషయం బయటపెట్టిన అఖిల్

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (11:10 IST)
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమా జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే, అఖిల్ మీడియాతో మాట్లాడుతూ.. సురేందర్ రెడ్డితో చేస్తున్న మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టాడు. ఇంతకీ ఏమన్నాడంటే... సురేందర్ రెడ్డితో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నాను. అది ఇప్పటికి కుదరింది. ఈ సినిమా మామూలుగా ఉండదు. ధూమ్ థామ్‌గా ఉంటుంది. యాక్షన్ ఉంటుంది.
 
అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని ఎదురుచూస్తున్నాను అని అఖిల్ చెప్పాడు. అఖిల్ ఇలా చెప్పినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయని చెప్పచ్చు. ఈ సినిమాని అనిల్ సుంకర భారీ స్ధాయిలో నిర్మిస్తున్నారు. సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. ఈ సినిమాతో అభిమానులు ఆశించిన విజయం సాధిస్తాడని.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments