Webdunia - Bharat's app for daily news and videos

Install App

12వ రోజు ఇంటి సభ్యులకు వింత శిక్ష వేసిన బిగ్ బాస్

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (10:10 IST)
బిగ్ బాస్ 4 స్టార్ట్ అయినప్పుడు పెద్దగా ఇంట్రస్టింగ్‌గా లేదు అనిపించినా.. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటివరకు ఎప్పుడూ రాని విధంగా టాప్ టీఆర్పీ రేటింగ్ రావడంతో మా టీవీ తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... 12వ రోజు బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగింది. స్కిట్స్, పాటలు, డ్యాన్సులతో సరదాగా సాగినప్పటికీ, మధ్యలో గొడవలు, అలకలు ఎప్పటిలానే కనిపించాయి. అలాగే ఇంటి నిబంధనలు ఉల్లంఘించిన ఇంటి సభ్యులకు శిక్ష విధిస్తూ బిగ్‌బాస్ ఆదేశాలు జారీ చేశారు.
 
బిగ్ బాస్ హౌస్‌లో శిక్షలు వింతగా ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. శిక్ష విధించడంతో పాటు మూడో వారానికి ఇంటి కెప్టెన్‌ ఎంపిక ప్రశాంతంగా జరిగింది. ఇంటి సభ్యులు నియమాలు పాటించకపోవడంపై బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి రాకపోవడం, తెలుగులో మాట్లాడకుండా ఇతర భాషల్లో మాట్లాడటంపై కోపగించుకొన్నారు.
 
బెల్ మోగిన సమయంలో గార్డెన్ ఏరియాలోకి వచ్చి 20 గుంజీలు తీయాలి. బిగ్‌బాస్ మమ్మల్ని క్షమించాలి అని బోర్డుపై రాయాలి అని ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత ఇంటిలో కెప్టెన్ ఎంపిక మొదలైంది. నోయల్, అభిజిత్, మెహబూబ్, కల్యాణి కెప్టెన్ రేసులోకి వచ్చారు. ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో నోయల్‌ను కొత్త కెప్టెన్‌గా ఎన్నుకొన్నారు. కెప్టెన్‌గా ఎన్నికైన నోయల్‌ను బిగ్‌బాస్ అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments