Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్స్‌లో కట్టప్ప ఎవరు? బిగ్‌బాస్ టాస్క్

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్స్‌లో కట్టప్ప ఎవరు? బిగ్‌బాస్ టాస్క్
, శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:37 IST)
Noel_Kattappa
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ప్రస్తుతం బిగ్ బాస్ కట్టప్ప టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన 14మంది కంటిస్టెంట్స్‌లో ఒకరు కట్టప్ప ఉన్నారని సూచించిన బిగ్ బాస్.. ఆ కట్టప్ప ఎవరో తెలుసుకోవాల్సిందిగా ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం కట్టప్ప ఎవరు అనే విషయంపైనే ఆ 14 మంది కంటెస్టంట్స్ మధ్య తీవ్రమైన చర్చ జరుగుతోంది. 
 
ఇప్పటికే బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో కట్టప్పగా ఎవరిపై అనుమానం ఉందో వాళ్ల పేరు ఒక పేపర్‌పై రాసి ఒక బాక్సులో వేయాల్సిందిగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ సూచించాడు. ఆ టాస్క్‌లో చాలా మంది అఖిల్‌ కట్టప్ప అయ్యుంటాడనే అనుమానంతో అతడి పేరు రాసి బాక్సులో వేశారు. మరుసటి రోజైన నాలుగో రోజు అరియాన, సొహెల్‌ని కన్‌ఫెషన్ రూమ్‌కి పిలిచిన బిగ్ బాస్.. ఇంటి సభ్యుల దృష్టిలో కట్టప్ప ఎవరో తెలుసుకోవాల్సిందిగా మరోసారి సూచించాడు.
 
అందుకోసం మిగితా 14 మంది ఇంటి సభ్యులను ఒక్కొక్కరిగా పిలిచి అడగమన్నాడు. ఐతే సోహైల్, అరియానాలకు సమాధానం చెప్పడం ఇష్టం లేని కొంత మంది మాత్రం వాళ్ల సమాధానం నేరుగా బిగ్ బాస్‌కి చెప్తాం కాని వాళ్ళిద్దరికి చెప్పమని అన్నారు. ఇంకొంత మంది మాత్రం వాళ్లకి తోచిన సమాధానం చెప్పారు.  
 
ఇందులో భాగంగానే గత సీజన్‌లో నామినేట్ చేసే ఇంటి సభ్యుల ముఖంపై స్టాంప్ వేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కట్టప్ప ఎవరో తెలుసుకునేందుకు తెరపైకి తీసుకువచ్చాడు. ఆ టాస్క్ ప్రకారం ఎవరినైతే కట్టప్పగా భావిస్తున్నారో వాళ్ల ముఖంపై కట్టప్ప అనే స్టాంప్‌ వేయాల్సి ఉంటుంది. అలా ఒకొక్కరుగా వచ్చి వాళ్లకి ఎవరిపై డౌట్ ఉందో వాళ్ళపై స్టాంప్ వేశారు. అలా కొంతమంది లాస్య, సూర్య కిరణ్, నోయల్‌పై వేశారు.
 
ఐతే సింగర్ నోయల్ సీన్ వంతు వచ్చేటప్పటికి అతడు మాత్రం కట్టప్పగా మరొకరిని అనుమానించేందుకు తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పాడు. కట్టప్పగా వేరే వాళ్ల పేరు చెప్పి తాను ఎవరిని హర్ట్ చేయదల్చుకోలేదు.. ఎందుకంటే నేనే కట్టప్ప అని బదులిస్తూ జై మహిష్మతి అంటూ నోయల్ తన ముఖంపై తనే స్టాంప్ వేసుకున్నాడు. ఇదంతా చూస్తుంటే మీకు నోయలే కట్టప్ప అనే అనుమానం వస్తుంది.
 
మరోవైపు శుక్రవారం లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా.. ఇంటి సభ్యులు టమోటా జ్యూస్ తీస్తున్న సమయంలో ఎండ్ అయిన బిగ్ బాస్ ఎపిసోడ్ శనివారం అక్కడి నుండే ప్రారంభమైంది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన 30 బాటిల్స్ ఆర్డర్‌ను ఎవరు పూర్తి చేయకపోవడంతో ఇవ్వవలసిన పాయింట్స్‌లో బిగ్ బాస్ భారీగా కోత విధించారు 14,000 పాయింట్స్ కు గానూ 2000 పాయింట్స్ ఇచ్చి అందరినీ షాక్‌కి గురి చేశారు.
 
ఇక అల్లు అర్జున్ నటించిన జులాయి చిత్రం లోని పకడో పకడో వేకప్ సాంగ్‌తో నిద్రలేచిన బిగ్ బాస్ హౌస్ మెట్స్ గంగవ్వ వర్కౌట్స్ చూసి, 62 ఏళ్ళ వయసులో ఆమె అంత చురుగ్గా ఉండటం చూసి షాకయ్యారు. ఇక కిచెన్‌లో శుభ్రంగా ఉండాలనే అంశంపై మొనాల్ గజ్జర్, రాజశేఖర్ మాస్టర్ మధ్య వివాదం చెలరేగింది. కాని అది ఎవరూ ఆపకుండా కూల్ అయిపోయింది.
 
పాపం ఎగ్స్ తినని మోనాల్ ఆ ఎగ్స్‌ను ఎక్కడపడితే అక్కడ పెట్టొద్దని తెలుగులో చెప్పడానికి కళ్యాణి సహాయం తీసుకున్నారు. ఇక కొద్దిసేపటికే లాస్య, మొనాల్‌లు వంట చేస్తున్న టైంలో కరాటే కళ్యాణి తనకి ఫుడ్ వద్దని తను ఉపవాసం ఉంటానని చెబుతూ బయటకు వచ్చేసింది. ఇది చూసి మనం వంట చేస్తున్నందుకు ఆమె ఇలా అంటున్నారా అని లాస్య, మొనాల్‌ ఆలోచనలో పడ్డారు. ఇక బయటికి వచ్చిన కరాటే కళ్యాణి అఖిల్ దగ్గరకు వెళ్లి తనకు ఆర్డర్లు వేసిన కండిషన్స్ పెట్టిన నచ్చదని తెగ ఫీల్ అయిపోయారు.
 
కొద్దిసేపటికి బిగ్ బాస్ కిచెన్ లో అమ్మా రాజశేఖర్ మాస్టర్ నిన్న అందరూ కంటెస్టెంట్‌లతో ఓపెన్ అయిన దివితో పులిహార కలుపుతూ అడ్డంగా ఇంటి సభ్యులకు దొరికిపోయారు. ఇక ఆతరువాత ఇంటి సభ్యులలో కొందరిపై నోయల్ ర్యాప్ సాంగ్ పాడి అలరిస్తే. దేవి, మెహబూబ్, దివి నోయల్ పై ఓ ర్యాప్ సాంగ్ పాడి అతన్ని సర్‌ప్రైజ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి గుండు వెనకున్న అసలు కథ ఇదేనా?