Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

గత యేడాది వివాహం.. ఈ యేడాది విడాకులు : 'వెయ్యి అబద్దాల' హీరోయిన్ కథ..

Advertiesment
BB Telugu 4
, మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (13:36 IST)
గత యేడాది ప్రేమించిన వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకున్న వెయ్యి అబద్దాల హీరోయిన్‌కు సరిగ్గా యేడాది తిరగకముందే కష్టాలు మొదలయ్యాయి. ఫలితంగా తన భర్తతో విడిపోయింది. ఈ విషయాన్ని ఆ హీరోయిన్ భర్త నోయల్ వెల్లడించారు. ఇంతకీ ఈ వెయ్యి అబద్దాల హీరోయిన్ ప్రేమకథ నుంచి విడాకుల వరకు జరిగిన విషయాన్ని పరిశీలిస్తే, 
 
ర్యాప‌ర్‌గాను, సింగర్‌గాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచిత‌మైన వ్య‌క్తి నోయ‌ల్‌. గ‌త ఏడాది జన‌వ‌రిలో తేజ దర్శకత్వం వహించిన 'వెయ్యి అబద్ధాలు' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన నటి ఎస్తర్‌ని ప్రేమించాడు. ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడటంతో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 
 
ఈ విష‌యాన్ని నోయ‌ల్ త‌న అఫీషియ‌ల్ పేజ్ ద్వారా ప్ర‌క‌టించారు. కొన్నాళ్ళుగా ప్రేమ‌లో ఉన్న ఈ ప్రేమికులు ఇద్ద‌రు పెళ్లి చేసుకున్నార‌న్న విష‌యం తెలుసుకొని అంద‌రు సంతోషించారు. కానీ తాజాగా నోయ‌ల్ తాము విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 
 
ఇదే అంశాన్ని నోయల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఎస్త‌ర్ నుంచి విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. కోర్టు త‌మ విడాకుల విష‌యంలో అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. దానికోసం ఎదురు చూస్తున్నాం. ఈ విష‌యంలో ఎవ‌రు కూడా ఎస్త‌ర్ లేదా ఆమె కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని ప్రాధేయడ్డాడు. 
 
పైగా, ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చిన కొన్ని మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల‌న విడాకుల వ‌ర‌కు వెళ్లాం. ఓ అందమైన బంధాన్ని, దాని విలువను కాపాడేందుకు మేము ఇలా విడిపోయాం. దేవుడు ఎస్త‌ర్‌ని చ‌ల్ల‌గా చూడాలి. ఆమె క‌న్న క‌లలు నిజం కావాలి. 
 
కష్ట కాలంలో నాతో పాటు ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు అని నోయ‌ల్ పేర్కొన్నారు. కాగా, ఎస్త‌ర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన 'జయ జానకి నాయకి' చిత్రంలో నటించింది. ఇప్పడు అమ్మడు హిందీ, మరాఠీ, తెలుగు, తమిళ ప్రాజెక్టులతో ఫుల్‌బిజీగా ఉంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమారుడికి నామకరణం చేసిన కేజీఎఫ్ హీరో