Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్.. ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారా? గంగవ్వ వెళ్ళిపోతుందా?

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (11:42 IST)
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ ఈ వారం అసలైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వనుంది. పోయిన వారం సూర్య కిరణ్ ఎలిమినేషన్ అయ్యాడు. ఈ వారం ఇద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. హౌస్‌లో మొత్తం 16 మంది ఉండగా.. మొదటి వారంలో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఆయన స్థానంలో సాయి కుమార్ వచ్చేశాడు. 
 
ఇప్పుడు జబర్దాస్త్ అవినాష్ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ వారం ఇద్దరు బయటకు వెళతారని సమాచారం. అందులో ఒకరు కరాటే కల్యాణి అని తెలుస్తోంది. అంతేకాదు ఆమె ఎలిమినేషన్ దాదాపుగా ఖారారైందట. ఆమెతో పాటు మరోకరు కూడా బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే అది గంగవ్వే కావచ్చనేది టాక్. కారణం ఆమెకు అక్కడి వాతావరణం పెద్దగా నచ్చట్లేదట. దీంతో బయటకు వెళ్ళిపోవాలని కోరుకుంటోందట గంగవ్వ. 
 
ఇకపోతే.. షో ప్రారంభమైన వారం రోజులకే బిగ్‌బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ అస్త్రాన్ని బయటకు తీశారు. అందులో భాగంగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 'ఈరోజుల్లో' బస్టాప్ ఫేమ్ సాయి కుమార్ హౌజ్'లోకి వచ్చాడు. మొదటి వారంలో నీరసంగా సాగిన షో రెండోవారంలోకి వచ్చేసరికి పూర్తి వినోదాత్మకంగా మారింది. ఇంకా లవ్ స్టోరీ కూడా ప్రారంభమైంది. అభిజిత్, అఖిల్, మునాల్‌ల ముక్కోణపు ప్రేమకథ ఆసక్తి కరంగా సాగుతోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌కి ఏకంగా 9 మందిని నామినేట్ చేశారు. 
 
ఇక రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా రానుందని తెలుస్తోంది. అందులో భాగంగా తాజా ప్రోమోలో ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు.అంతేకాదు ఆ వ్యక్తి తనను తాను జోకర్‌గా పరిచయం చేసుకున్నాడు. దీంతో జబర్దస్త్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈరోజుల్లో ఫేమ్ సాయి కుమార్ మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌజ్‌లోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments