Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడోవారం కెప్టెన్సీ టాస్క్‌.. కెప్టెన్ ఎవరంటే?

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (10:57 IST)
Jaswanth
బిగ్ బాస్ ఐదో సీజన్ విజయవంతంగా 19 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. 19వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులు తమ గతాన్ని అందరికి చెబుతూ ఎమోషన్‌కి గురికాగా కెప్టెన్‌ రేసులో జస్వంత్ విజేతగా నిలిచాడు. మూడోవారం కెప్టెన్సీ టాస్క్‌ పోటీదారుల ఎంపికలో భాగంగా.. రవికి ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌ని రివీల్ చేశారు బిగ్ బాస్.

ప్రియ నక్లెస్‌ను దొంగిలించే టాస్క్‌ని విజయవంతంగా కంప్లీట్ చేయడంలో రవి మూడో వారం కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక అయ్యారు. ఇక అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి టాస్క్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన శ్రీరామ్, జెస్సీ, శ్వేతాలను కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేశారు.
 
అయితే కెప్టెన్సీ పోటీదారుని ఎంపిక సందర్భంగా వాగ్వాదం జరిగింది. సన్నీ, లోబోలపై అరిచి.. నాకు ఇష్టం లేకపోయినా తన టీంలో జెస్సీకి సపోర్ట్ చేయాల్సి వస్తుందని చెప్పింది లహరి. అయితే రవి డబుల్ మైండ్‌తో అటు జెస్సీ.. ఇటు లహరి అని అంటూ.. తెలివిగా లహరితోనే జెస్సీకి సపోర్ట్ చేసేట్టు చేశాడు.
 
ఇక తర్వాత కెప్టెన్సీ టాస్క్‌ని ఇచ్చారు బిగ్ బాస్. కెప్టెన్ పోటీదారులుగా ఉన్న రవి, శ్రీరామ్, జెస్సీ, శ్వేతాలు స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న కెప్టెన్ అనే అనే అక్షరాలను ఒక్కొక్కటి పట్టుకుని వచ్చి అన్నింటినీ ముందు ఎవరైతే పేరుస్తారో వాళ్లే ఈవారం కెప్టెన్ అవుతారని టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌కు లోబో సంచాలకుడిగా వ్యవహరిస్తారని చెప్పగా సరదాగా సాగిన ఈ టాస్క్‌లో అందరికంటే ముందుగా జెస్సీ టాస్క్‌ని కంప్లీట్ చేసి మూడోవారం కెప్టెన్ అయ్యారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments