వేధింపులకు గురైన కరాటే కళ్యాణి.. ఎంపీనని ఫోన్ చేసి.. పెళ్లి అయ్యిందా అంటూ?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (11:39 IST)
కరాటే కళ్యాణి వేధింపులకు గురయ్యారు. ఒడిశా ఎంపీనంటూ ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేసి వేధించినట్లు కరాటే కళ్యాణి ఆరోపించారు. తాను మూడు సార్లు ఎంపీగా గెలిచానని.. మీ సేవా కార్యక్రమాలు బాగున్నాయని మాట్లాడారట. ఏదైనా సాయం కావాలంటే చెప్పు.. కోట్లైనా ఇస్తానని ఆఫర్ చేశారట.
 
ఒక్కడే గొంతు మార్చి తనతో పలు మార్లు మాట్లాడానని కళ్యాణి చెప్పారు. 10 సార్లు ఫోన్ చేసి విసిగించిన తర్వాత..మీకు పెళ్లయిందా? అని అడిగారని ఆమె పేర్కొన్నారు. తనకు విషయం అర్ధమై ఫోన్ కట్ చేసినట్లు వెల్లడించారు.
 
తన ఫోన్ నెంబర్ కోసం బీజేపీ నేతలు విజయశాంతి, డీకే అరుణను అడిగానని.. తనపై ఆయనకు ఎందుకో అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అని ఫేస్‌బుక్‌లో కరాటే ప్రశ్నించారు. మీకు బీజేపీలో ఏదో పదవి ఉందనుకున్నా అంటూ మాట కలిపాడని.. తాను ఇప్పుడు ఏ పార్టీలో లేనని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.
 
సమాజంలో ఇలాంటి వారు చాలా మంది ఉంటారు..తస్మాత్ జాగ్రత్త అని తన అభిమానులను హెచ్చరించారు కరాటే కల్యాణి. ఎవ్వరినీ నమ్మవద్దని సూచించారు. తనతో పెట్టుకుంటే బాజా బారాత్ అంటూ ఆ వ్యక్తికి కూడా వార్నింగ్ ఇచ్చారు. 
 
ఐతే ఆమెకు కాల్ చేసింది నిజంగానే ఒడిశా ఎంపీయా? లేదంటే ఎంపీ పేరుతో ఎవరైనా ఆకతాయి కాల్ చేశాడా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కరాటే కళ్యాణి ఫేస్‌బుక్ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments