ఆ తారకరాముడి దండకం ఈ తారకరాముడు కోసం ఆలపించిన బాలకృష్ణ. శుక్రవారంనాడు తన తండ్రి 99వ జయంతి సందర్భంగా 10గంటలకు విడుదల చేశారు.
మహానుభావులు యుగానికి ఒక్కరే పుడతారు
వారి ప్రస్తావనే ప్రపంచాన్ని ప్రకరింపజేస్తుంది. వారి ఆలోచనలే అనంతమైన ఆనందాన్ని అనుభూతులోకి తెస్తుంది. వారి విజయగాధలు వేరొ లోకంలోకి వెంట తీసుకెళతాయి.
అలాంటి అరుదైన కోవకు చెందిన వాడు మన తారకరాముడు
గల్లీలో పాలుపోసినవాడు ఢిల్లీని దడపుట్టించాడు
రంగులేసుకునేవాడు రాజ్యాలు ఏలటం
గ్రీకు శిల్పంలాంటి రూపంతో పురాణ పాత్రలలో జీవించడం.
తెలుగు గడప రంగు జెండాలతో ప్రతిపేద వారిక వెన్నపూస తెలుగుజాతి వెన్నెముక
మా న్నాన మీ అన్నగారు. 99 వ జయంతి. వచ్చే ఏడాది వంద వసంతాలు జరుపుకోవాలంటూ ఆ మహానియుడిని ఈ శ్రీరామ దండకం అంకితం.
అంటూ. ఏకబిగిన బాలకృష్ణ పాటను పాడి అలరించారు. ఇదిగో వినండి.