Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల నగారా మోగింది.. జగన్ సర్వేలో తేలిన వ్యక్తినే..?

Advertiesment
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల నగారా మోగింది.. జగన్ సర్వేలో తేలిన వ్యక్తినే..?
, బుధవారం, 17 మార్చి 2021 (08:32 IST)
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 23వ తేది నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆ రోజు నుండే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం అవుతుంది. 30వ తేది నామినేషన్ల్ల దాఖలుకు చివరి తేది. 31న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఏప్రిల్‌ 3న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది. 
 
ఏప్రిల్‌ 17న ఎన్నికలు జరుగుతాయి. మే 2 వ తేది కౌంటింగ్‌ జరుగుతుంది. మే 4తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. వైసిపికి చెందిన సిట్టింగ్‌ ఎంపి బల్లి దుర్గాప్రసాద్‌ మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. 
 
తెలంగాణలో నాగార్జునసాగర్‌ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికకకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇక్కడ టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. సాగర్‌లో కైడా ఏప్రిల్‌ 17న పోలింగ్‌, మే 2న కౌంటింగ్‌ జరగనుంది. షెడ్యూల్‌ విడుదల కావడంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.
 
తిరుపతి పార్లమెంట్‌ ఉప పోరులో వైసిపి అభ్యర్థిగా డాక్టర్‌ గురుమూర్తిని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. సీఎం జగన్‌ చేయించిన సర్వేలో కొత్త వ్యక్తికే గెలుపు సునాయాసమని తేలడంతో దళితుడైన గురుమూర్తి అనూహ్యంగా తెరపైకి వచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్క్ పెట్టుకోలేదు.. ఫ్లైట్‌ సీటులో మూత్ర విసర్జన.. 20 ఏళ్ల జైలు ఖాయమా?