Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BiggBoss3Telugu నీ మీద పడతారు.. ఎందుకు అరుస్తావ్.. వితికపై వరుణ్ ఫైర్

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (17:45 IST)
బిగ్ బాస్ 3 తెలుగు సరికొత్త టాస్క్‌లతో దూసుకుపోతోంది. ఈ వారం బిగ్ బాస్ ఇంటిసభ్యులకు నామినేషన్ టాస్క్ ఇవ్వడంతో పాటు కొన్ని షరతులు విధించాడు. ఇందులో భాగంగా కెప్టెన్‌ శ్రీముఖి తప్ప మిగతావారంతా ఇంట్లోకి వెళ్లకుండా గార్డెన్‌ ఏరియాలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ వారం నామినేషన్‌లో భాగంగా రాళ్లే రత్నాలు అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. 
 
వర్షం రూపంలో వచ్చిన విలువైన రాళ్లను సేకరించి తమ ఖాతాలో జమచేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా రాళ్లను సేకరించేందుకు బిగ్ బాస్ హౌజ్ మేట్స్ పోటీపడ్డారు. అయితే తాజాగా ఓ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మంగళవారం జరిగే ఎపిసోడ్‌కి సంబంధించిన ఈ ప్రోమోలో వరుణ్, వితికలు గొడవపడ్డారు. నిన్నటి ఎపిసోడ్‌లో తక్కువ విలువైన రాళ్లను సేకరించిన రాహుల్ ఈ వారం ఎలిమినేషన్‌లోకి వచ్చాడు. ఈ ఈరోజు ఎపిసోడ్‌లో మరికొంత మంది నామినేషన్ జోన్‌లోకి రాబోతున్నారు. 
 
ఇక సోషల్ మీడియాలో విడుదలైన ప్రోమోలో వరుణ్, వితికాకి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాళ్లను తీసుకునే ప్రయత్నంలో వితికా, బాబా భాస్కర్‌పై ఫైర్ అవుతోంది. రాళ్లను తీసుకెళ్తూ బాబా పొరపాటున వితికాను తోయడంతో.. తను వచ్చి వరుణ్‌పై పడింది. దీంతో వరుణ్ మూతికి దెబ్బతగిలింది. 
 
చూసుకుని ఆడొచ్చు కదా.. ఎందుకు మీద పడుతున్నారు.. అని అరిచింది. హలో ఎందుకు అరుస్తున్నావ్.. ఆడితే ఆడు లేకపోతే పక్కకు జరుగు. గేమ్ అన్న తరువాత నీ మీద పడతారు. నా మీద కూడా పడ్డారు నేను నీలా అరిచానా..? ఎందుకు ప్రతి దానికి పెద్ద వింత చేస్తావు అంటూ మండిపడ్డాడు. దీంతో వితికా చెవులు మూసుకున్నట్లు ప్రోమోలో కనిపిస్తోంది ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments