Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 3 తెలుగు... నామినేషన్.. శ్రీముఖిని టార్గెట్ చేసిందెవరు?

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (14:21 IST)
బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్‌ తొమ్మిదో వారానికి చేరుకుంది. నామినేషన్‌లో భాగంగా రంగస్థలం చిత్రంలో ఆ గట్టున వుంటావా? ఈ గట్టున ఉంటావా? అనే రంజుగా ఉండే సాంగ్‌తో మొదలైన బిగ్‌బాస్ ఆటలో ఆసక్తికరపరిణామాలు చాలానే జరిగాయి. ముందుగా ఎవర్ని నామినేట్ చేస్తే బావుంటుందన్న దానిపై మహేష్, వరుణ్, పునర్నవిల మధ్య చర్చ నడిచింది. 
 
మనం మనం నామినేట్ చేసుకుంటున్నాము తప్పితే శ్రీముఖిని ఎవరూ నామినేట్ చేయడం లేదు. బిగ్ బాస్ డైరెక్ట్‌గా ఆమెను రెండు సార్లు నామినేట్ చేయడంతో ఎలిమినేషన్‌కి వచ్చింది తప్పితే ఆమెను మనం నామినేట్ చేయలేదని చర్చ మొదలుపెట్టారు. అయితే అలీని కూడా మనం ఇదే రీజన్‌తో నామినేట్ చేశామని ఈ వారం శ్రీముఖి ఇదే కారణంతో ఎలిమినేట్ చేయొచ్చని వరుణ్ సలహా ఇచ్చారు.
 
మరోవైపు.. గత సీజన్‌లో ఇచ్చిన ఫోన్‌ బూత్‌ టాస్క్‌ని బిగ్‌బాస్‌ ఈసారి కూడా రిపీట్‌ చేసాడు. నామినేట్‌ అయిన కంటెస్టెంటుల కోసం త్యాగం చేయాల్సిన ఈ టాస్క్‌లో బిగ్‌బాస్‌ తెలివిగా జంటలు కట్టిన వారిని లేదా ఎవరి మధ్య అయితే సఖ్యత వుందో వెతుక్కుని టాస్క్‌లు ఇచ్చాడు. పునర్నవిని సేవ్‌ చేయడానికి రాహుల్‌ ఇరవై గ్లాసుల కాకరకాయ రసం తాగితే, శ్రీముఖి కోసం బాబా భాస్కర్‌ క్లీన్‌ షేవ్‌ చేసుకున్నాడు. 
 
అలాగే రవి కోసం శివ జ్యోతి మెడ వరకు జుత్తు కత్తిరించుకుంది. హిమజని కాపాడేందుకు వరుణ్‌ సందేశ్‌ పేడ తొట్టెలో పడుకుంటే, భర్త చేసిన త్యాగాన్ని వృధా చేస్తూ కెప్టెన్‌గా తనకున్న అధికారాన్ని వాడి హిమజని వితిక నేరుగా నామినేట్‌ చేసింది. హిమజ కోసం వరుణ్‌ ఆ త్యాగం చేయడమే వితికకి నచ్చలేదు. శ్రీముఖితో క్లోజ్‌గా వుంటోన్న హిమజని పునర్నవి కూడా బాగానే టార్గెట్‌ చేసింది.
 
మొత్తానికి నామినేషన్లలోకి వెళ్లిన హిమజ ఈసారి ఎలిమినేట్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది. నామినేట్‌ అయిన వారిలో రాహుల్‌ స్ట్రాంగ్‌గా వుంటే, మహేష్‌ కంటే హిమజకి తక్కువ ఓట్లు పడుతున్నాయి. షో మొదలయినపుడు తన గ్లామర్‌తో ఆకట్టుకున్న హిమజ ఆ తర్వాత జోకర్‌ వేషాలేస్తూ స్టాండ్‌ తీసుకోకుండా సపోర్టర్స్‌ని కోల్పోతూ వచ్చింది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments