Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ వ‌ర‌ల్డ్ రికార్డ్... ఇంత‌కీ ఏంటా రికార్డ్..?

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (13:26 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. బాహుబ‌లితో కొత్త రికార్డులు సృష్టించిన ప్ర‌భాస్.. సాహో సినిమాతో కూడా రికార్డులు సాధించి సంచ‌ల‌నం సృష్టించాడు. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తూ సంబ‌రాలు చేసుకుంటున్నారు. తాజాగా సాహో నెలకొల్పిన రికార్డులు అందుకోడానికి మిగతా సినిమాలకు కాస్త ఎక్కువ సమయమే పడుతుందని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
 
అయితే... ప్రభాస్ ప్రభంజనం ఒక్క సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఒక రేంజ్‌లో ఉందని ఇప్పుడు డార్లింగ్ అభిమానులు సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తున్నారు. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే... మాములుగా ప్రభాస్ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటారు. అయితే  ప్రభాస్ తన ఆఫీసియల్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను తెరిచారు. 
 
అంతే క్షణాల్లో లక్షలాది మంది ప్రభాస్‌ను ఫాలో అయ్యారు. అలాగే ప్రభాస్ పెట్టిన మొట్ట మొదటి పోస్ట్‌తో ఇప్పుడు డార్లింగ్ వరల్డ్ రికార్డు సెట్ చేసాడని అభిమానులు అంటున్నారు. ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన మొట్టమొదటి పోస్ట్‌కు ఏకంగా 1 మిలియన్ లైక్స్ వచ్చాయని ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి రికార్డుగా ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. 
 
మొట్టమొదటి పోస్టుకే 1 మిలియన్ లైక్స్ ఎవ్వరికి రాలేదని అలా సాధించిన ఏకైక హీరో ప్రభాస్ ఒక్కడే అని ఇది ఒక వరల్డ్ రికార్డు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు ప్ర‌భాస్‌కి ఫాలోయింగ్ ఏ రేంజ్ లోఉందో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments