బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముంబైలో మాట్లాడిన శ్రద్ధా కపూర్.. తనకు సాహో సినిమా బెస్ట్ అని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఎన్నో హిట్స్ దక్కాయని, అయితే వాటన్నిటిలోకి ప్రభాస్ తో నటించిన సాహో నే ది బెస్ట్ అని చెప్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కేవలం హిందీ వర్షన్‌లోనే సాహో రూ.150 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ సాధించిందని.. ఇది ఇప్పటివరకు తాను నటించిన అన్నీ సినిమాల్లో కంటే అత్యధికమని చెప్తోంది.
సాహో కోసం యూనిట్ లోని ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పని చేసారని, అయితే చివరకు ప్రజలు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చినందకు తమకు ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించింది. నటుడిగా ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని, ఆయనతో కలిసి భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నట్లు శ్రద్ధ తెలిపారు.
అయితే శ్రద్ధ చేసిన ఈ కామెంట్స్ పై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు పలువురు నెటిజన్లు. కొందరేమో ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం, సాహో ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఆ విషయాన్ని శ్రద్ధ మరిచిపోయారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.