Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్ నుంచి సునైనా అవుట్.. కన్నీళ్లు పెట్టుకున్న తనీష్

బిగ్‌బాస్ సీజన్ 2లో భాగంగా ఈ వారం దీప్తి సునైనా బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో తనీష్ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టాడు. తర్వాత స్టేజ్ మీదకి వ

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (11:54 IST)
బిగ్‌బాస్ సీజన్ 2లో భాగంగా ఈ వారం దీప్తి సునైనా బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో తనీష్ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టాడు. తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన సునైనా.. తనీష్, సామ్రాట్‌లతో మాట్లాడాలని ఉందని కోరింది. తనీష్‌తో మాట్లాడుతూ.. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావ్.. టైటిల్ కొట్టి బయటకి రా అంటూ ధైర్యం చెప్పింది. 
 
అలాగే తనీష్ మాట్లాడుతూ.. తనకు కుమార్తె పుడితే సునైనా లాగానే వుండాలని కోరుకుంటాను.. సునైనా ఎప్పుడూ నువ్ నీలానే వుండాలని ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత సునైనా బిగ్ బాంబ్‌ని తనీష్ పై విసిరింది. దీని ప్రకారం బిగ్ బాస్ హౌస్‌లో సాంగ్ వచ్చిన ప్రతిసారి స్విమ్మింగ్ పూల్‌లో దూకాల్సి వుంటుంది. ఇకపోతే.. సునైనా ఎలిమినేట్ కావడం వెనుక కౌశల్ ఆర్మీ ప్రభావం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  
 
కాగా బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 70వ రోజున సునైనా ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఎలిమినేషన్‌కు ముందు గీత గోవిందం దర్శకుడు పరుశురాం, హీరో విజయ్ దేవరకొండ బిగ్‌బాస్ వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత దీప్తి సునైనతో సీక్రెట్ టాస్క్‌ను నానీ, విజయ్, పరుశురాం పర్యవేక్షణలో జరిపించారు. టాస్క్‌లో భాగంగా గీతా, సామ్రాట్‌ను లడ్డూతో కొట్టింది. నిద్రిస్తున్న అమిత్‌పై నీళ్లు పోసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments