Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ పరిశ్రమను వెంటాడుతున్న కరోనా.. రవికృష్ణకు కరోనా?

Webdunia
శనివారం, 4 జులై 2020 (10:20 IST)
Ravikrishna
టీవీ పరిశ్రమను కరోనా వెంటాడుతోంది. లాక్ డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో సినీ, టీవీ నటులు షూటింగ్స్‌లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం బుల్లితెర నటులపై పంజా విసురుతోంది. ఇప్పటికే ప్రభాకర్, హరికృష్ణ, నవ్య స్వామిలకు కరోనా సోకడం జరిగింది. తాజాగా మరో టీవీ నటుడు దీని బారిన పడ్డాడు. తెలుగులో అనేక సీరియల్స్ లో నటించిన రవి కృష్ణకు కరోనా సోకిందని తెలుస్తోంది. 
 
కరోనా లక్షణాలతో బాధపడుతున్న రవి కృష్ణ వైద్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా వచ్చిందని నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు రవి కృష్ణను క్వారెంటైన్‌కు పంపించివేశారు. ప్రస్తుతం రవి కృష్ణ కరోనా చికిత్స తీసుకుంటున్నాడు. ఇక రవి కృష్ణతో గత కొన్ని రోజులుగా దగ్గరగా తిరుగుతున్న వారందరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
 
అంతేకాకుండా వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. నటుడు రవి కృష్ణ బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న సంగతి తెలిసిందే. సీరియల్స్‌లో కంటే ఇతను బిగ్ బాస్‌లో పాల్గోని చాలా పాపులర్ అయ్యాడు. ఇక ఒకరినుండి ఒకరికి కరోనా వ్యాప్తి చెందడంతో ఇప్పటికే టాలీవుడ్‌లో అన్నిరకాల షూటింగ్స్ నిలిపివేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

ఈ-కార్ రేస్‌కు నిధుల మళ్లింపు - ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments