తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. సినీ ప్రముఖులను, బుల్లితెర నటులను కాటేస్తున్న కరోనా వైరస్.. ప్రస్తుతం యాంకర్లపై పడింది. అయితే కొన్ని పుకార్లు కూడా చక్కర్లు కొడుతున్నాయని తెలుస్తోంది.
మొన్నటికి మొన్న ప్రముఖ యాంకర్ ఓంకార్ కి కరోనా సోకినదంటూ ఒక ఫేక్ న్యూస్ హల్ చల్ చేసింది. దీంతో ఆయన దానిపై వివరణ ఇచ్చారు. తనకి కరోనా సోకలేదని.. ఇదంతా పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు.
తాజాగా కరోనా మహమ్మారి బారిన కత్తి మహేష్ పడినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రముఖ మీడియా సంస్థలో ఒక షో నిర్వాహకుడిగా పనిచేస్తున్న కత్తి మహేష్‌కు కరోనా రావడంతో సదరు ఛానల్లోని ఉద్యోగులు భయపడిపోతున్నారంటూ.. ఒక ఫేక్ న్యూస్ ప్రచారంలో ఉంది.
దీనిపై స్పందించిన కత్తి.. తనకి కరోనా సోకలేదని.. ఇదంతా అవాస్తవపు వార్తలని తేల్చేశాడు. ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.