Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్‌లోకి హిజ్రా కమ్ నటి.. ఎవరు? (Video)

ప్రముఖ టీవీ చానెల్ స్టార్ మాలో బిగ్‌బాస్ రెండో సీజన్ రియాల్టీ షో ప్రసారమవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఈ షో ప్రసారమవుతోంది. తెలుగులో యువ హీరో నాని హోస్ట్‌గా చేస్తుంటే, తమిళంలో విశ్వ నటుడు కమల్

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (17:23 IST)
ప్రముఖ టీవీ చానెల్ స్టార్ మాలో బిగ్‌బాస్ రెండో సీజన్ రియాల్టీ షో ప్రసారమవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఈ షో ప్రసారమవుతోంది. తెలుగులో యువ హీరో నాని హోస్ట్‌గా చేస్తుంటే, తమిళంలో విశ్వ నటుడు కమల్ హాసన్, మలయాళంలో మోహన్‌లాల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
 
ఈ మూడు భాషల్లోనూ బిగ్ బాగ్ షో మంచి రేటింగ్‌తో ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో మలయాళం బిగ్‌ బాస్‌లో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. మ‌ల‌యాళ బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో ఈ వారం హౌస్ నుంచి హాట్ బ్యూటీ శ్వేతామీన‌న్ ఎలిమినేట్ అయింది. ఆమె స్థానంలో హిజ్రా కం న‌టి అంజ‌లి అమీర్ ఇంట్లోకి రావ‌డం ఇపుడు అంతా చర్చనీయాంశంగా మారింది. 
 
మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన "పెరంబు" చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది అంజలి. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల‌లో న‌టించిన ఆమె ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటుంది. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో స‌ర్వత్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. 
 
మ‌రి అంజ‌లి బిగ్ బాస్ హౌస్‌లో చేసే సంద‌డి ఎలా ఉంటుంద‌నేది స‌స్పెన్స్. మ‌రే ఇదే స్పూర్తితో త‌మిళం, తెలుగు భాష‌ల‌లోను హిజ్రాల‌ని హౌజ్‌లోకి తీసుకొచ్చే అవ‌కాశం ఉంటుందా? అని ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments