Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారణం అది కాదు.. అడిగినంత ఇవ్వలేదనీ... (Video)

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'భారత్' అనే సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అమెరికా సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్ చేస్తున్న ప్రియాం

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (15:50 IST)
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'భారత్' అనే సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అమెరికా సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్ చేస్తున్న ప్రియాంకా త్వరలో అతన్ని పెళ్లి చేసుకోనుంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.
 
అయితే, ప్రియాంకా భారత్ వంటి భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి గల కారణాలపై బాలీవుడ్ ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. ఈ చిత్రం కోసం ప్రియాంకా రెమ్యూనరేషన్ కింద మొత్తం రూ.14 కోట్లు డిమాండ్ చేసిందట. కానీ ఆమెకు కేవలం రూ.6.5 కోట్ల చెక్‌ను మాత్రమే ఇచ్చారని తెలిసింది. దీంతో సంతృప్తి చెందని ప్రియాంకా.. ఆ ఫిల్మ్ నుంచి తప్పుకున్నట్టు తేలింది. 
 
ప్రియాంకా అర్థాంత‌రంగా ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంద‌ని ఇటీవ‌ల 'భార‌త్' చిత్ర ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్ ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. ఆమె తీసుకున్న నిర్ణయానికి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. 'భారత్' చిత్రబృందం నుంచి ప్రియాంకకు శుభాకాంక్షలు.. జీవితం ఆనందంతో నిండి ఉండాల‌ని కోరుకుంటున్నాం అని ట్వీట్‌ చేశారు. 
 
దీంతో అంద‌రు ప్రియాక‌.. నిక్ జోన‌స్‌ని వివాహం చేసుకుంటున్న సంద‌ర్భంగా సినిమా నుండి త‌ప్పుకుంద‌ని అని భావించారు. కానీ అస‌లు కార‌ణం అది కాద‌ని ఇపుడు తేలిపోయింది. మరోవైపు ప్రియాంకా స్థానంలో కత్రికా కైఫ్‌ను ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ మూవీని 2019 ఈద్‌కు విడుదల చేయ‌నున్నారు. ఇందులో కత్రినాతో పాటు దిషా పటానీ, సునీల్‌ గ్రోవర్‌, నోరా ఫతేహి, టబు తదితరులు ప్రధాన తారాగణంగా ఉన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments