Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగవ్వ ఎఫెక్ట్.. లంబాడీ గ్రామానికి మళ్లీ బస్సు సేవలు

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (19:22 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా అందర్నీ ఆకట్టుకున్న గంగవ్వ అనారోగ్య కారణాలతో బయటకు వచ్చేసింది. వచ్చే ముందు తనకు ఓ ఇల్లు కావాలనే చిరకాల కోరికను హోస్ట్ నాగార్జున ముందు ఉంచింది. గంగవ్వ కొత్తింటి నిర్మాణం కోసం అక్కినేని నాగార్జున నుంచి చెక్కుతోపాటు బిగ్ బాస్ రెమ్యూనరేషన్ కూడా వచ్చిందని గంగవ్వ చెప్పింది. 
 
గంగవ్వది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం కాగా, కరోనా సమయంలో ఈ గ్రామానికి బస్సు సర్వీసు నిలిపేశారు. 
 
కూలీలు, విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్లి రావడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్‌ వాహనాల్లో జగిత్యాలకు వెళ్లి రావాలంటే వాహన చార్జీలతో తలకుమించిన భారమైంది. దీంతో బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు లంబాడిపల్లి గ్రామ ప్రజా ప్రతినిధులు గంగవ్వ సాయం కోరారు. 
 
లంబాడిపల్లికి తిరిగి బస్సు తీసుకురావడం కోసం గ్రామస్థులతో కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులను కలిసింది గంగవ్వ బృందం. గంగవ్వ వినతితో లంబాడిపల్లికి బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించారు అధికారులు. ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఐదు ట్రిప్పలుగా ఆర్టీసీ సేవలు అందిస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments