Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవును.. ప్రేమించాను.. అతడికి పెళ్లైపోయింది.. బిందు మాధవి

Advertiesment
Bigg Boss Non Stop
, సోమవారం, 7 మార్చి 2022 (23:13 IST)
ఆవకాయ్ బిర్యానీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బిందు మాధవి ప్రస్తుతం కోలీవుడ్‌కు మకాం మార్చేసింది. అక్కడ జూనియర్ సిల్క్ స్మితగా పేరు కొట్టేసిన బిందు.. తాజాగా తన ప్రేమాయణానికి సంబంధించిన సీక్రెట్‌ను బయటపెట్టింది. 
 
చిత్తూరు జిల్లాకు చెందిన బిందు మాధవి.. మొదట్లో తెలుగు పరిశ్రమలో పలు సినిమాలు చేసి, తమిళంలో ఫుల్‌ బిజీ అయిపోయింది బిందు మాధవి.  
 
అయితే.. తాజాగా బిందు మాధవి తన లవర్‌ ఎఫైర్‌ గురించి సంచలన విషయాలు చెప్పింది. అయితే.. తన లవ్‌ బ్రేకప్‌ తర్వాత.. తాను డీప్రెషన్‌లోకి వెళ్లానని చెప్పింది బిందు మాధవి.
 
తన కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించానని.. కానీ ఆ తర్వాత విడిపోయానని తెలిపింది. కెరీర్‌ కోసమే తాము దూరమయ్యామని.. ఉన్నత చదువుల కోసం అతను అమెరికా వెళ్లి పోయాడని పేర్కొంది బిందు.
 
తాను సినిమా ల మీద మక్కువతో ఇక్కడే ఉండిపోయానని.. అతడు మాత్రం వేరే పెళ్లి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతడితో ప్రేమ ఎప్పటికీ తనకు స్పెషలేనని బిందు మాధవి వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా దినోత్సవంనాడు కొంచెం కారం కొంచెం తీపి తెలుగు సిరీస్ ప్రారంభం