Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ కంటస్టెంట్ల వివరాలు.. కంటస్టెంట్లు వీరేనా?

Webdunia
సోమవారం, 19 జులై 2021 (12:29 IST)
తెలుగు బిగ్‌బాస్‌ రియాలిటీ షో.. ఈ పేరు తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీ, తమిళ్‌, తెలుగు అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ఈ బిగ్‌ రియాల్టీ షోకి ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక తెలుగులో అయితే సీజన్‌, సీజన్‌కి బిగ్‌బాస్‌ ప్రేక్షకులు పెరిగిపోతున్నారు. అన్ని సీజన్లు కూడా సక్సెస్‌ఫుల్‌గా ప్రసరమై ఇప్పుడు ఐదు సీజన్‌కు రెడీ అవుతోంది. బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
 
ఈ ఐదో సీజన్‌ సరికొత్తగా ఉండేందుకు నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సీజన్‌ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే సెట్ ఏర్పాటుతోపాటు.. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్లు తెలుస్తుంది. 
 
ఇక దీనికి సంబంధించి కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లను ఓ సారి చూద్దాం.. యాంకర్‌ వర్షిణి , యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, శేఖర్‌ మాస్టర్‌, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి.
 
ఈ పేర్లు చక్కర్లు కొడుతున్నప్పటికి దీనిపై బిగ్‌బాస్‌ నిర్వాహకుల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లలో సగానికి పైగా బిగ్‌బాస్‌ బాస్‌లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments