Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్‌బాస్ 13' విజేత సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మృతి

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (12:23 IST)
నటుడు, బిగ్ బాస్ 13వ సీజన్ విజేత సిద్ధార్థ్ శుక్లా గురువారం కన్నుమూశారు. 40 యేళ్ల శుక్లాకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్టు కూపర్ ఆసుపత్రి వెల్లడించింది. ఈయనకు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. 
 
నటుడు ఇటీవల రియాలిటీ షోలు బిగ్ బాస్ ఓటీటీ, మరియు డాన్స్ దీవానే 3లో స్నేహితురాలు షెహ్నాజ్ గిల్‌తో కనిపించడంతో ఈ వార్త అతని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈయన చివరగా ఏక్తా కపూర్ యొక్క ప్రముఖ కార్యక్రమం 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3'లో కనిపించారు. 
 
12 డిసెంబర్ 1980 న ముంబైలో అశోక్ శుక్లా,రీటా శుక్లా దంపతులకు జన్మించిన సిద్దార్థ్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (గతంలో అలహాబాద్)లో మూలాలు ఉన్నాయి. అతను సెయింట్ జేవియర్స్ హైస్కూల్, ఫోర్ట్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. రచన సంసాద్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ నుండి ఇంటీరియర్ డిజైనింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.
 
సిద్ధార్థ్ శుక్లా మరణవార్త వచ్చిన వెంటనే, పలువురు ప్రముఖులతో పాటు అతని అభిమానులు ట్విట్టర్‌లో సంతాప పోస్ట్‌లతో ముంచెత్తారు. 2020 సంవత్సరం కూడా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దిగ్భ్రాంతికరమైన మరణం బాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments