Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ దెబ్బకు ప్రేమ పెటాకులు... ప్రేయసి వుందని తెలిసి కూడా ఓకే చెప్పేసింది...

ప్రస్తుతం ఇండియాలో బిగ్ బాస్ హవా నడుస్తోంది. అన్ని భాషల్లోనూ మంచి క్రేజున్న షోగా దూసుకుపోతోంది. తెలుగు, తమిళనాట కాస్త లేటుగా మొదలైనప్పటికీ మంచి టిఆర్‌పిలతో రెండవ సీజన్‌లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ త

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (21:14 IST)
ప్రస్తుతం ఇండియాలో బిగ్ బాస్ హవా నడుస్తోంది. అన్ని భాషల్లోనూ మంచి క్రేజున్న షోగా దూసుకుపోతోంది. తెలుగు, తమిళనాట కాస్త లేటుగా మొదలైనప్పటికీ మంచి టిఆర్‌పిలతో రెండవ సీజన్‌లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ తమిళంలో ఈ షో కారణంగా ఒక ప్రేమజంట విడిపోయింది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
 
తమిళ్ సీజన్ 1లో ఓవియా మరియు ఆరవ్ ప్రేమ కథ ఓ రేంజ్‌లో పాపులరైంది. అదేవిధంగా సీజన్ 2లో కంటెస్టెంట్‌గా ఉన్న మహత్‌కు బిగ్ బాస్ హౌస్‌లోకి రాక ముందే ప్రాచి అనే ప్రేయసి ఉంది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఇదే విషయం హౌస్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రేక్షకులందరి ముందు కూడా చెప్పాడు. హౌస్‌లో మరో కంటెస్టెంట్ యాషికని ప్రేమించి, ప్రపోజ్ చేసాడు ఈ ప్రబుద్ధుడు. ఇందులో హైలైట్ ఏంటంటే అతడి ప్రేమను యాషిక అంగీకరించింది.
 
ఇదంతా ప్రసారమైన తర్వాత నెటిజన్లు ప్రాచీని ట్యాగ్ చేయడం మొదలుపెట్టారు. అసలే బాధలో ఉన్న ప్రాచి ఇలా తన వ్యక్తిగత జీవితం రోడ్డు మీదకు రావడంతో సోషల్ మీడియా వేదికగా ఇన్‌స్టాగ్రామ్‌లో తాను మహత్‌తో బ్రేకప్ చేసుకుంటున్నట్లు పోస్ట్ పెట్టింది. బిగ్ బాస్ పుణ్యమాని ఇంకా ఏమేం జరుగుతాయో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments