బోళాశంకర్‌ తాజా షెడ్యూల్‌ షురూ

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (15:34 IST)
MeherRamesh, AnilSunkara
మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రం విజయోత్సవంలో వుండగానే తన కొత్త సినిమా కోసం జాతర సాంగ్‌ను చేస్తున్నారు. కొల్‌కొత్తా నేపథ్యంలో రూపొందుతోన్న బోళా శంకర్‌ చిత్రం కోసం తాజా షెడ్యూల్‌ మంగళవారంనాడు ప్రారంభమైంది. మియాపూర్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో ఈరోజు అమ్మవారిపై పాటను, ఆ తర్వాత యాక్షన్‌ ఎపిసోడ్‌ను తీయనున్నారు.
 
మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ కొంత భాగం ఇదివరకే పూర్తయింది. వాల్తేరు వీరయ్య ప్రమోషన్‌ కోసం షూటింగ్‌ను వాయిదా వేశారు. వాల్తేరు వీరయ్య కోసం వేసిన జాలరి సెట్‌ సమీపంలోనే బోలాశంకర్‌ కోసం అమ్మవారి సెట్‌ వేశారు. కొల్‌కొత్తా నేపథ్యం గనుక ఆ తరహాలో బెంగాలీ జూనియర్‌ ఆరిస్టులు ఇందులో పాల్గొన్నారు.  తమన్నా భాటియా, కీర్తి సురేష్‌ నటిస్తున్న ఈ సినిమాను అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఫెస్టివల్‌ సందర్భంగా జరగబోయే పాటను ఇందులో చిత్రీకరిస్తున్నారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చనున్నారు. ఇది మలయాళ రీమేక్‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chain snatching: హన్మకొండలో చైన్ స్నాచింగ్ కేసు.. వీడియో వైరల్

వేసవిలో మండే ఎండలు.. క్యూలైన్లలో ప్రజలు నిలవొద్దు.. ఒకే నెలలో 3నెలల రేషన్

శాసనమండలిలో స్వల్ప అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ

యువతికి హోలీ రంగులు పూసి మత్తుపానీయం త్రాగించి తోటలోకి తీసుకెళ్లి...

బొత్స సత్యనారాయణ గారు నమస్కారం.. నారా లోకేష్ ఆత్మీయ పలకరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments