Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోళా శంకర్- భోళా మానియా ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో విడుదల కాబోతుంది

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (17:44 IST)
bhola shankar new
వాల్తేరు వీరయ్య విజయంతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’ తో బిజీగా ఉన్నారు. రామబ్రహ్మం సుంకర అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
భోళా మానియా జూన్ 4న విడుదలయ్యే మొదటి సింగిల్‌ తో ప్రారంభమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి అల్ట్రా-మోడిష్ అవతార్‌ లో  స్టైలిష్ పోస్టర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేసినట్లు  రేపు పాట ప్రోమోను విడుదల చేయనున్నారు. చిరు స్పోర్ట్స్ షేడ్స్‌ తో స్టార్ చిహ్నాలు ఉన్న ఆకుపచ్చ చొక్కా ధరించి, త్రిశూల్ ఆకారంలో చైన్ ని తిప్పుతూ కనిపించారు.
 
ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. జూన్ నెలాఖరకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
 
అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్  భావోద్వేగాలు, ఇతర అంశాలు సమపాళ్లలో వుంటాయి.
 
తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా  కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నారు.
 
డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
 
భోళా శంకర్  ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ , రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం ఎక్కబోయే యువతి అండర్‌వేర్‌లో లైటర్స్: శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలెర్ట్

Jalgaon Train Accident: జల్గావ్ జిల్లా ఘోర రైలు ప్రమాదం.. 20మంది మృతి

అమ్మా... అత్తయ్య నాపై అత్యాచారం చేసింది: తల్లి వద్ద విలపించిన బాలుడు

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్‌లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.. ఇది ఏం చేస్తుందో తెలుసా?

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments