Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏజెంట్, కస్టడీ కాన్సెప్ట్ లో తప్పిదం ఎవరిదీ?

akhil-chaitu
, శుక్రవారం, 12 మే 2023 (18:19 IST)
akhil-chaitu
అక్కినేని అఖిల్ నటించిన సినిమా ఏజెంట్ రాంగ్ అటెంప్ట్. ఇది చిత్ర నిర్మాత అనిల్ సుంకరకు రిలీజ్ ముందునుంచి తెలుసు. అందుకే ఈ సినిమా కొత్త ప్రయోగం. ఇది సక్సెస్ అయితే మరో ప్రయత్నం చేస్తామని, ఆదరిస్తే  సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా చెప్పాడు. కానీ సినిమా చూసాక మొదటి పార్ట్ రాంగ్ కాన్సెప్ట్ అని తెలిసింది. ఫైనల్గా అక్కినేని ఫాన్స్ కూడా రిజెక్ట్ చేయడంతో ఏజెంట్ సినిమా తీయడం మా తప్పిదమే అని నిర్మాత ప్రకటించాడు. అఖిల్ స్థాయికి మించిన పాత్ర గా పోషించ్చాడు. సీక్వెల్ కు ఛాన్స్ లేదు. 
 
ఇక ఈరోజు విడుదల అయిన కస్టడీ విషయానికి వస్తే, పోలీస్ పాత్ర నాగ చైతన్య చేసాడు. దీని కోసం పోలీస్ పెద్దలను కలిసి చాలా విషయాలు కథలు తెలిసుకొని ఆశ్చర్య పోయానని అందుకే సినిమా చేశానని అన్నాడు. ఈ సినిమాకు సీక్వెల్  కూడా ప్లాన్ చేస్తున్నానని నిర్మాత, హీరో కూడా చెప్పాడు. కానీ కథలో లాజిక్ ను దర్శకుడు, నిర్మాత మర్చిపోయారు. తార్కిక అంశాల విషయానికి వస్తే, రాష్ట్ర పోలీసు అధికారులు తప్పులు చేసినప్పుడు సిబిఐ అధికారులు చాలా బలహీనంగా ఉన్నారని చూపించారు. సీబీఐ. అధికారిని చంపడానికి రాష్ట్ర పోలీస్ అధికారి చూస్తాడు. దాన్నీ సాహసంతో పోలీస్ పాత్ర చైతు రక్షిస్తాడు. ఈ కథ తమిళనాడు మాజీ సి.ఎం. జయలలిత స్టోరీ అని తెలిసిపోతుంది. 
 
ఇలాంటి తమిళ కథతో తమిళ సినిమాగా తీసి తెలుగు హంగులు రుద్దారు. తమిళంలో నాకు ఈ సినిమాతో ఎంట్రీ అవుతుందని చైతు చెప్పడం విశేషం.  అందుకే సినిమా చేసాడని తెలిసిపోతుంది. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువ. చైతు కు మాస్ ఇమేజ్ రావడం కోసం చేసాడు. ఒకరకంగా వయస్సుకు మించిన పాత్ర. అలా చేయాలంటే ధనుష్, శింబు వంటి వారు చేసిన వినూత్న కథలు ఎంచుకోవాలి. తమిళ దర్శకుడు కథ చెప్పినప్పుడే హీరోకి అర్థం అయి ఉండాలి. తమిళ్ హీరోస్ ముందుకు రాకపోవడంతో చైతు బలియైనట్లున్నాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి సీక్వెల్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే కథ కామన్ మాన్ కు కనెక్ట్ కాదు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అజయ్ ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్‌ గా చక్రవ్యూహం