Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎవరి సినిమా విడుదలైనా మీడియాలో వచ్చే కామెంట్స్ చదువుతా : నాగ చైతన్య

naga chaitanya
, ఆదివారం, 7 మే 2023 (12:02 IST)
అక్కినేని నాగ చైతన్య హీరోగా కోలీవుడ్ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కస్టడీ'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.
 
ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ 'కస్టడీ' కథ తనకెంతో నచ్చిందన్నారు. పాన్‌ ఇండియా సినిమాలకంటూ ప్రత్యేక కథలు ఉండవన్నారు. కంటెంట్‌ బాగుంటే మూవీ విడుదలయ్యాక అది ఆ స్థాయిలో విజయం సాధిస్తుంది. నా కెరీర్‌లో 'లాల్‌ సింగ్‌ చడ్డా', 'థ్యాంక్యూ' సినిమాలు పరాభవం పొందాయి. లాల్‌సింగ్‌.. ప్లాప్‌ అవుతుందని ఊహించలేదన్నారు.
 
కానీ, 'థ్యాంక్యూ' మాత్రం ఎడిటింగ్‌ పూర్తయ్యాక చూసినప్పుడు ఇంకాస్త బెటర్‌గా చేయచ్చేమోనని అనిపించింది. కథ బాగున్నా మేకింగ్‌లో తడబడినట్లు అనిపించింది. అందుకే ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదేమోనని నా అభిప్రాయం. హిట్‌ అయిన సినిమా కంటే ప్లాప్‌ నుంచే ఎక్కువ విషయాలు నేర్చుకుంటాం. నా సినిమాలు ఏవి విడుదలైనా సోషల్‌మీడియలో వచ్చే కామెంట్స్‌, రేటింగ్స్‌ అన్నీ చూస్తాను. వాళ్ల పాయింట్ ఆఫ్‌ వ్యూవ్‌లో కూడా ఆలోచిస్తాను అని అన్నారు. 
 
ఇకపోతే, తాజా చిత్రం విషయానికి వస్తే, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది తెరకెక్కింది. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన 'ఉప్పెన' భామ కృతి శెట్టి నటిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తయిన దగ్గరి నుంచే చిత్రబృందం ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. ఇప్పటికే రియల్‌ పోలీసులతో కలిసి నాగచైతన్య కొన్ని వీడియోలు చేసిన విషయం తెలిసిందే. అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత చాలా మంచి మనస్సున్న వ్యక్తి : నాగ చైతన్య