అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన చిత్రం "ఏజెంట్". ఏప్రిల్ 28వ తేదీన ఈ మూవీ విడుదలైంది. తొలి షో నుంచే ఫ్లాట్ టాక్‌ను సొంతంచేసుకుంది. ఈ పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనంటూ నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. స్క్రిప్టు సిద్ధం కాకముందే షూటింగ్ ప్రారంభించి తప్పు చేశామని అందుకే ఇలా జరిగిందని ఆయన తెలిపారు. పైగా, ఈ సినిమా ఫ్లాప్‌లకు సాకులు చెప్పాలని అనుకోవడం లేదని తెలిపారు.
దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పూర్తి స్పై యాక్షన్ చిత్రంగా రూపొందించారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. అయితే, ఈ చిత్రం అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దీనిపై నిర్మాత అనిల్ సుంకర స్పందించారు.
సినిమా పరాజయానికి సారీ చెప్పారు. 'ఏజెంట్' ఫ్లాప్ విషయంలో పూర్తి బాధ్యత తమదేనని ట్వీట్ చేశారు. అదో పెద్ద టాస్క్ అని తెలిసినా సాధించగలమన్న నమ్మకంతో సినిమా చేశారు. కానీ, అది ఫెయిల్ అయిందన్నారు. స్క్రిప్టు పూర్తిగా సిద్ధం కాకముందే ఈ సినిమాను ప్రారంభించి తప్పు చేశామని తెలిపారు. దీనికితోడు షూటింగ్ సమయంలో కోవిడ్ సహా ఇతర సమస్యలు కూడా చుట్టుముట్టాయని తెలిపారు. అయితే, సినిమా ఫలితం విషయంలో సాకులు చెప్పాలని అనుకోవడం లేదని, ఈ ఖరీదైన తప్పిదాల నుంచి ఎన్నో నేర్చుకున్నామని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.9 కోట్ల గ్రాస్‌ను రూ.5.10 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే రూ.11.50 కోట్ల గ్రాస్‌ను రూ.6.24 కోట్ల షేర్‌ను రాబట్టినట్టుస మాచారం. పైగా, ఏ రోజుకు ఆ రోజు కలెక్షన్లు గణనీయంగా తగ్గిపోవడంతో ఈ చిత్ర బయ్యర్లు అపార నష్టాన్ని చవిచూశారు.