Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంకొండ గణేష్ చిత్రం నేను స్టూడెంట్ సార్ డేట్ ఫిక్స్

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (17:08 IST)
Bellamkonda Ganesh
‘స్వాతిముత్యం’ సినిమా తో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్ థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాఖీ  ఉప్పలపాటి దర్శకత్వం వహించగా, ఎస్వీ 2 ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌ పై మంచి అంచనాలు నెలకొల్పగా, ఫస్ట్ సింగిల్‌ కి కూడా మంచి ఆదరణ లభించింది.
 
ఇదిలా ఉంటే, ఈ చిత్రం కొత్త విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ తో వచ్చారు మేకర్స్. ‘నేను స్టూడెంట్ సార్!’’ జూన్ 2న థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. జూన్ రెండవ వారం తర్వాత విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగుస్తాయి కాబట్టి ఇది అనువైన డేట్.
 
గణేష్,  అవంతిక దస్సాని సహా ప్రముఖ తారాగణం ఉన్న పోస్టర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేదు కాబట్టి ప్రమోషన్స్ జోరు పెంచనున్నారు.
 
సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కృష్ణ చైతన్య కథ అందించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. అనిత్ మాదాడి కెమెరామెన్ గా పని చేస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్, కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందిస్తున్నారు.
 
నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments