Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాయే మాయే అంటున్న బెల్లంకొండ గణేష్

Advertiesment
Bellamkonda Ganesh, Avantika Dassani
Bellamkonda Ganesh, Avantika Dassani
హీరో బెల్లంకొండ గణేష్ యాక్షన్ థ్రిల్లర్ ''నేను స్టూడెంట్ సర్!'. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ చిత్రాన్ని 'నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు.  ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది,
 
తాజాగా చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారభించింది. 'నేను స్టూడెంట్ సర్!' ఫస్ట్ సింగిల్ మాయే మాయే డిసెంబర్ 1న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో గణేష్, అవంతికల జోడి చూడముచ్చటగా వుంది.
 
ఈ చిత్రంతో అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు.
 
నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హను-మాన్ టీమ్ ని అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి