Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

దేవీ
గురువారం, 17 ఏప్రియల్ 2025 (16:27 IST)
Sumaya Reddy, Prithvi Amber, Sai Rajesh
తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
 
సుమయ రెడ్డి మాట్లాడుతూ, తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎక్కువగా వస్తున్నారు. నేను ఓ అడుగు ముందుకు వేసి సినిమాని నిర్మించాను. ప్రతీ ఒక్కరూ వారి వారి డ్రీమ్ ప్రాజెక్టుకి పని చేసినట్టుగానే వర్క్ చేశారు. ప్రతీ మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే.. ప్రతీ అమ్మాయి విజయం వెనకాల ఓ అబ్బాయి ఉంటాడు. నగేష్ ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచీ నాతో పాటే ఉన్నారు. మీ కోసం మీరు నిలబడకపోతే, మీ కోసం ఎవరూ నిలబడరు. ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడి వరకు తీసుకు వచ్చాను. ఏప్రిల్ 18న మా చిత్రం థియేటర్లోకి రాబోతోంది. అందరూ చూసి సినిమాని విజయవంతం చేయండి’ అని అన్నారు.
 
పృథ్వీ అంబర్ మాట్లాడుతూ, నా దియా చిత్రాన్ని ఇక్కడ అందరూ ఆదరించారు. మొదట్లో తెలుగు అంతగా అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాను. సుమయ రెడ్డి ఈ చిత్రం కోసం చాలా కష్టపడింది. డియర్ ఉమ సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.
 
డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ, కరోనా టైంలో సుమయ రెడ్డి ఓ కథ రాశారు. అది నాకు చాలా నచ్చింది. అలా డియర్ ఉమ చిత్రం మొదలైంది. మేం ఈ కథను నమ్మి చాలా మంది వద్దకు తిరిగాం. కానీ కథలో చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. అందుకే సుమయ రెడ్డి గారే స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సమాజానికి ఓ సందేశాన్ని ఇవ్వాలని ఆమె సినిమాను నిర్మించారు. సమాజానికి ఈ సినిమా అవసరం ఉంది. అందుకే చిత్రాన్ని తీశాం. డియర్ ఉమ సినిమాను అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నితిన్ సాయి చంద్రారెడ్డి మాట్లాడుతూ .. ‘మా అక్క సుమయా రెడ్డి డియర్ ఉమ అనే మంచి సందేశాత్మక చిత్రాన్ని తీశారు. ఇలాంటి గొప్ప చిత్రాలు ఈ మధ్య రావడం లేదు. ఇంత మంచి ప్రాజెక్టులో భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.
 
లైన్ ప్రొడ్యూసర్ నగేష్ మాట్లాడుతూ .. ‘సుమయ రెడ్డి నాకు మంచి స్నేహితురాలు. తన డ్రీమ్స్ గురించి, తన స్టోరీ గురించి ఎప్పుడూ చెబుతుండేవారు. డియర్ ఉమ చిత్రం కోసం ఆమె చాలా కష్టపడ్డారు. ఇంత మంచి చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 
జ్యోతి రెడ్డి మాట్లాడుతూ .. ‘నా కూతురు సుమయ రెడ్డి తీసిన డియర్ ఉమ చాలా బాగా వచ్చింది. హీరోయిన్, ప్రొడ్యూసర్, రైటర్ అయిన సుమయ రెడ్డి నాకు రోల్ మోడల్‌. పదేళ్ల నుంచి కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చింది. ఎవరి కోసమో ఎదురుచూడకుండా కష్టపడి పైకి వచ్చింది. డియర్ ఉమ సినిమాను ఏప్రిల్ 18న అందరూ చూడండి’ అని అన్నారు.
 
కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ .. ‘సాయి రాజేష్ అద్భుతంగా డియర్ ఉమ చిత్రాన్ని తీశారు. సుమయా రెడ్డి గారు ఇచ్చిన కథ నిజంగానే అద్భుతంగా ఉంటుంది. ఆ కథను మరింత అద్భుతంగా తీశారు. అప్పట్లో వెంకటేష్ బాబు గణేష్ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. అందులో హాస్పిటల్ వ్యవస్థను చూపించారు. డియర్ ఉమ చిత్రంలోనూ అలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఈ చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. అందరికీ అవగాహన కల్పించేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments