Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త సినిమాతో మీ ముందుకు వస్తే చెప్పుతో కొట్టండి: సిద్ధార్థ్ (Video)

గృహం సినిమా హీరో సిద్ధార్థ్.. మీడియా ముందు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్, ఆండ్రియా జంటగా నటించిన గృహం సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఏర

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (17:39 IST)
గృహం సినిమా హీరో సిద్ధార్థ్.. మీడియా ముందు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్, ఆండ్రియా జంటగా నటించిన గృహం సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. మంచి సినిమాలే తాను చేస్తానని.. చెత్త సినిమాతో మీ ముందుకు వస్తే చెప్పుతో కొట్టండి అన్నారు. 
 
తాను మంచి సినిమాలను మాత్రమే చేయాలనుకుంటానని అందుకే మంచి రోల్స్ చేస్తున్నానని సిద్ధార్థ్ తెలిపారు. గృహం సినిమాకు కో-ప్రొడ్యూసర్, కో-రైటర్‌గా కూడా సిద్ధార్థ్ వ్యవహరించాడు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ, కెరీర్ పరంగా తానెప్పుడూ కిందకు పడిపోలేదని, కేవలం బ్రేక్ మాత్రమే తీసుకున్నానని తెలిపారు. తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగానే సినిమాలు తీస్తానన్నారు. 
 
తన జీవితంలో జరిగిన రెండు సంఘటనలతో ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకున్నానని సిద్ధార్థ్ తెలిపాడు. ఒకస్థాయిలో వుండి పడిపోయి తిరిగి సినిమా చేస్తున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. సిద్ధార్థ్ సమాధానమిస్తూ.. జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోనని.. రీకలెక్ట్ చేసుకోనని.. వెనక్కి తిరిగి చూడనని ధీటుగా సమాధానం ఇచ్చారు.

తనకు ఎంత పొగరెక్కువ వుందో.. అంతే నిజాయితీ వుందని తెలిపారు. లైఫ్‌లో ఎవరు పడిపోరని.. అలా పడిపోయివుంటే గృహం సినిమా ద్వారా కో-ప్రోడ్యూసర్‌గా, కో-రైటర్‌గా తన టీమ్‌తో మీ ముందుకు వచ్చి కాలిపై కాలేసుకుని కూర్చోనని సిద్ధార్థ్ తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments