Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవకాశాలివ్వకపోతే భాషతో కొడతాను అంటున్న రాశీఖన్నా.. కోలీవుడ్‌లో వేషం దొరికిందట

ఉత్తరాది నుంచి దక్షిణాదికి వలస వస్తున్న భామలు ఇక్కడ అవకాశాలు రావాలంటే ముందుగా ప్రాంతీయ భాషలపై పట్టు సాధించడమే మార్గమని తేల్చేసుకున్నారు. వచ్చిన కొత్తలోనే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుపై ఎంత గట్టి పట్టు సాధించారంటే చిరంజీవి అంత మెగాస్టారే ఆమె తెలుగును ప్ర

అవకాశాలివ్వకపోతే భాషతో కొడతాను అంటున్న రాశీఖన్నా.. కోలీవుడ్‌లో వేషం దొరికిందట
హైదరాబాద్ , శుక్రవారం, 19 మే 2017 (05:41 IST)
ఉత్తరాది నుంచి దక్షిణాదికి వలస వస్తున్న భామలు ఇక్కడ అవకాశాలు రావాలంటే ముందుగా ప్రాంతీయ భాషలపై పట్టు సాధించడమే మార్గమని తేల్చేసుకున్నారు. వచ్చిన కొత్తలోనే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుపై ఎంత గట్టి పట్టు సాధించారంటే చిరంజీవి అంత మెగాస్టారే ఆమె తెలుగును ప్రశంసించారు. హీరోలను, దర్శకులను పరచయం చేసుకోవడానికి భాషను మించిన సాధనం లేదని తేలిపోవడంతో ఉత్తరాది భామలు అర్జెంటుగా దక్షిణాది భాషల అభ్యసనంపై పడిపోయారు. బొద్దుగుమ్మ రాశీ ఖన్నా కూడా ఈ కోవలోకి చేరిపోయింది. 
 
బాలీవుడ్‌లో నటిగా పరిచయం అయిన రాశీఖన్నా, ఆ తరువాత టాలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. అక్కడ అవకాశాలను బాగానే రాబట్టుకున్న ఈ బ్యూటీకి తాజాగా కోలీవుడ్‌పై కన్ను పడింది. అంతే ఇప్పుడు ఒకేసారి ఏకంగా రెండు చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. అందులో ఒక చిత్రం ఇమైకా నోడిగళ్‌. ఇందులో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే రాశీఖన్నా పాత్ర ఏమిటనేగా మీ సందేహం తను నటుడు అధర్వతో రొమాన్స్‌ చేస్తోంది. మరో చిత్రం సైతాన్‌ కీ బచ్చా. ఇందులో సిద్ధార్థ్‌ కథానాయకుడు.
 
తాను తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నా కోలీవుడ్‌లో పరిచయం అవ్వాలన్న కోరిక చాలా కాలంగా ఉండేదని రాశీఖన్నా చెప్పింది. ఆ విషయాన్ని ఒకసారి నటుడు సిద్ధార్థ్‌కు చెప్పానని, అది జ్ఞాపకం ఉంచుకున్న ఆయన సైతాన్‌ కీ బచ్చా చిత్రంలో అవకాశం కల్పించారని చెప్పింది. ఇందులో తనది చాలా జాలీగా ఉండే పాత్ర అని తెలిపింది. ఇమైకా నోడిగళ్‌ చిత్రంలో ఆందుకు పూర్తి భిన్నమైన పాత్ర అని చెప్పుకొచ్చింది. అయినా రెండు చిత్రాల్లోనూ నటించడానికి స్కోప్‌ ఉన్న పాత్రలు లభించడం చాలా సం తోషంగా ఉందని అంది.
 
మలయాళంలోనూ విలన్‌ అనే చిత్రం ద్వారా పరిచయం కానున్నానని చెప్పింది. ప్రస్తుతం మలయాళ భాష నేర్చుకుంటున్నానని, మలయాళం భాష తెలిస్తే తమిళ భాష నేర్చుకోవడం సులభం అంటున్నారని, తదుపరి తమిళ భాష నేర్చుకుంటానని రాశీఖన్నా అంటోంది. 
 
అంతా బాగానే ఉంది. కానీ తెలుగు ఎప్పుడు నేర్చుకుంటావు రాశీ.. ఇప్పటికీ వేదికలపై చిలకపలుకులు ఇంగ్లీషులోనే వర్ణిస్తున్నావు కదా.. తెలుగు పనికిరానిదా మరి అని జనం అంటున్నారు. దీనికి రాశికి దొరికే పరిష్కారం తెలుగు నేర్చుకోవడమే..
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాది, నాగచెతన్యది దేవుడు పుట్టించిన ప్రేమ: సమంత ఉద్వేగం