Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

నాది, నాగచెతన్యది దేవుడు పుట్టించిన ప్రేమ: సమంత ఉద్వేగం

యువ నటుడు నాగచైతన్య ప్రేమలో మునిగి తేలుతున్న సమంత త్వరలో ఆయనతో ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ నటిగా బిజీగా ఉన్న సమంత మాట్లాడుతూ తనది, నాగచెతన్యది దైవీక ప్రేమగా పేర్కొన్నారు. కానీ నటన ఎన్నడూ నా వ్యక్తిగత జీవితాన్ని బాధించ

Advertiesment
Samantha
హైదరాబాద్ , శుక్రవారం, 19 మే 2017 (05:11 IST)
యువ నటుడు నాగచైతన్య ప్రేమలో మునిగి తేలుతున్న సమంత త్వరలో ఆయనతో ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ నటిగా బిజీగా ఉన్న సమంత మాట్లాడుతూ తనది, నాగచెతన్యది దైవీక ప్రేమగా పేర్కొన్నారు. కానీ నటన ఎన్నడూ నా వ్యక్తిగత జీవితాన్ని బాధించలేదని సమంత గర్వంగా చెప్పారు. సినిమాలో చెప్పే డైలాగులు వేరు నిజజీవితం వేరని పేర్కొన్నారు. నాగచైతన్య ఒక చిత్రంలో స్త్రీలు మగవారి మనశ్శాంతికి హాని కలిగిస్తారనే డైలాగులు చెప్పడం వివాదాస్పదమైన నేపధ్యంలో సమంత ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అది నన్ను ఉద్దేశించి అన్నది కాదులే అని కొట్టి పారేశారు. 
 
సినిమాకు తనకు మంచి బంధం ఉంది. అది తనకు చాలా సంతృప్తినిచ్చింది అని అన్నారు. సినిమాలో కష్టాలు ఎదురైనా వాటిని మరపించేంత సంతోషాన్ని సినిమా తనకు అందించిందని అన్నారు. అందుకే తనకు సినిమా అంటే అంత ప్రేమ అని పేర్కొన్నారు. నటన అనేది తనకు ప్రాణం అన్నారు. అందుకే నటనకు దూరం కాలేనని చెప్పారు. 
 
డబ్బుకోసమే, పేరు కోసమో తాను నటించడం లేదని, దానిపై ప్రేమ ఏమాత్రం తగ్గకపోవడం కారణంగానే నటనలో కొనసాగుతున్నానని అన్నారు. ప్రస్తుతం తమిళంలో విజయ్‌కు జంటగా ఒక చిత్రంతో పాటు మరో చిత్రం చేస్తున్నానని, అదే విధంగా మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్నాని సమంత వెల్లడించారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్‌ సినిమాకు వందకోట్ల బడ్జెట్టా... ఇదేం తెలుగు సినిమానా.. తప్పుకున్న లైకా..