Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీచర్‌ను రెస్ట్ రూమ్‌కు రమ్మన్నాడు.. ఆమె చెప్పుతో కొట్టింది..

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో.. చదువు చెప్పించే ఉపాధ్యాయులు చెప్పులతో దాడి చేసుకున్నారు. కదిరి మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేసే ఓ మహిళా టీచర్ పట్ల మున్సిపాలిటీలోనే మరో స్కూల్‌లో పనిచేసే మైనుద్

టీచర్‌ను రెస్ట్ రూమ్‌కు రమ్మన్నాడు.. ఆమె చెప్పుతో కొట్టింది..
, సోమవారం, 24 జులై 2017 (13:54 IST)
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో.. చదువు చెప్పించే ఉపాధ్యాయులు చెప్పులతో దాడి చేసుకున్నారు. కదిరి మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేసే ఓ మహిళా టీచర్ పట్ల మున్సిపాలిటీలోనే మరో స్కూల్‌లో పనిచేసే మైనుద్దీన్‌ అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళా టీచర్ చెప్పుతో కొట్టింది. అతడు కూడా తిరిగి దాడి చేశాడు. ఈ ఘటనను చాలామంది తమ సెల్ ఫోన్లో వీడియోలు తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కదిరి స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం 'ఆనంద ఆదివారం' పేరుతో మున్సిపల్‌ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు ఆటల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అక్కడికి మున్సిపల్‌ కమిషనర్‌ భవానిప్రసాద్‌తో పాటు మున్సిపల్‌ టీచర్లందరూ హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మహిళా టీచర్‌ ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమె టూవీలర్ వద్ద వేచి ఉన్న మైనుద్దీన్‌ "మీరు యూఎల్‌బీ (అర్బన్‌ లోకల్‌ బాడీ)కో ఆర్డినేటర్‌గా బదిలీ కోసం డీఎంఏ ఆఫీస్‌ నుండి ఆర్డర్‌ తెచ్చుకున్నారు. 
 
కానీ మున్సిపల్‌ కమిషనర్‌ మిమ్మల్ని రిలీవ్‌ చేయలేదని విన్నాను. ఒక పనిచేయండి. ఈ రోజు రాత్రికి కమిషనర్‌ రెస్ట్‌ రూంకు వచ్చి మాతో గడుపు... నీకు రిలీవింగ్‌ ఆర్డర్‌ ఇప్పిస్తాను అని అన్నాడు. దీంతో కంగుతిన్న సదరు మహిళా టీచర్‌ వెంటనే 'నీ భార్యను పిల్చుకెళ్లురా.. నాకు అలాంటి అలవాట్లు లేవు..' అంటూ చెప్పుతీసుకొని ఆ కామాంధుడిపైకి విసిరింది. అనంతరం ఇద్దరూ చెప్పులతో దాడి చేసుకున్నారు. 
 
గొడవ అనంతరం బాధిత మహిళా టీచర్‌ నేరుగా పట్టణ పోలీస్‌ స్టేషన్‌ చేరుకుని తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్వతాన్ని కదిలించడం సులభం.. కానీ పీపుల్స్ ఆర్మీతో పెట్టుకోవద్దు : భారత్‌కు చైనా వార్నింగ్