Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి రికార్డును బద్దలు కొట్టిన 2.O.. ఎంతో తెలుసా?

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (17:28 IST)
500 కోట్ల భారీ బడ్జెట్. సంవత్సరం పాటు పడిన శ్రమ. తారాగణం మొత్తం అగ్రతారలే. ఒకరు దక్షిణాది సూపర్ స్టార్. మరొకరు బాలీవుడ్ స్టార్. ఇంకొకరు దేశంలో పేరు కలిగిన దర్శకుడు శంకర్. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే 2.O సినిమా విడుదల ఆలస్యమవుతూ రావడంతో అభిమానుల్లో అనుమానం నెలకొంది.
 
సినిమాను ఈ సంవత్సరం కాకుండా వచ్చే నెలలో రిలీజ్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే మొత్తానికి చిత్రాన్ని విడుదల చేశారు. ఈ నెల 29వ తేదీన విడుదలైన 2.O సినిమా ప్రపంచ వ్యాప్తంగా 11 వేల థియేటర్లలో విడుదలై ప్రపంచ సినీపరిశ్రమ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. 
 
ఇప్పటివరకు సినీ పరిశ్రమలో బాహుబలి సినిమా రికార్డ్ ఒక రోజు కలెక్షన్ 130 కోట్లు. ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టి ఒక్కరోజులేనే 145 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది సినిమా. వారంరోజుల పాటు టిక్కెట్లు కూడా ఆన్‌లైన్‌లో లేవు. అన్ని షోలు ఫుల్ అయిపోయాయి. 2.O సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆనందంతో ఉన్నారు. ఇప్పటికే సినిమాకు 4 రేటింగ్ ఇవ్వడంతో భారీ కలెక్షన్ల దిశగా సినిమా దూసుకుపోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula: జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు.. పులివెందులతో సీన్ మారుతోందిగా!

నా మరదలంటే నాకు పిచ్చి ప్రేమ, పెళ్లి చేయకపోతే టవర్ పైనుంచి దూకి చస్తా: బావ డిమాండ్, ఏమైంది? (video)

అమెరికా విర్రవీగుతోంది.. భారత్‌తో పెట్టుకోవడమంటే ఎలుక వెళ్లి ఏనుగును గుద్దినట్టుగా ఉంటుంది..

Lakh Bribe: లంచం తీసుకున్న ఎస్ఐకి ఏడేళ్ల జైలు శిక్ష.. ఎక్కడ?

హంద్రీనీవా సుజల స్రవంతి నీటితో చంద్రబాబు చిత్ర పటం.. నెట్టింట వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments