Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీముఖి అందాలను జుర్రుకున్నానంటున్న నందు

నందు, శౌర్య, శ్రీముఖి, రోషిణి ప్రధాన పాత్రల్లో జేపీ క్రియేషన్స్ బ్యానర్‌పై ధ‌న జమ్ము నిర్మించిన చిత్రం 'బీటెక్ బాబులు'. ఈ చిత్రానికి శ్రీను ఇమంది దర్శకత్వం వ‌హించారు. ఈ చిత్రం ఈనెల 8వ తేదీన విడుదల కాన

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (13:38 IST)
నందు, శౌర్య, శ్రీముఖి, రోషిణి ప్రధాన పాత్రల్లో జేపీ క్రియేషన్స్ బ్యానర్‌పై ధ‌న జమ్ము నిర్మించిన చిత్రం 'బీటెక్ బాబులు'. ఈ చిత్రానికి శ్రీను ఇమంది దర్శకత్వం వ‌హించారు. ఈ చిత్రం ఈనెల 8వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
 
ఇందులో తొలుత హీరో నందు మాట్లాడుతూ, 'పెళ్ళిచూపులు త‌ర్వాత చాలా మంచి పాత్ర ఈ సినిమాలో ద‌క్కింది. నా పాత్ర ప్రతి ప్రేమికుడికి క‌నెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. శ్రీముఖికి, నాకు మ‌ధ్య వ‌చ్చే ప్రేమ స‌న్నివేశాలు హృద‌యాన్ని హ‌త్తుకుంటాయి. సీరియ‌స్‌గా ల‌వ్ ట్రాక్ న‌డుస్తూనే న‌వ్వులు పువ్వులు పూయించే కామెడీ స‌న్నివేశాలు కూడా హైలైట్‌గా ఉండేలా ద‌ర్శకుడు చక్కగా తెరకెక్కించారు. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. సినిమాపై యూనిట్ అంతా చాలా న‌మ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా. ముఖ్యంగా, ఈ చిత్రంలో శ్రీముఖి అందాలను జుర్రుకున్నంతపనిచేశాను' అని నవ్వుకుంటూ చెప్పారు. 
 
చాలాకాలం తర్వాత ఈ చిత్రంలో స్పూఫ్ చేశానని, 'సరైనోడు' స్పూఫ్ అదరగొట్టానని అంతా అంటున్నరాని నటుడు అలీ చెప్పారు. ఇప్పటికే స్పూఫ్ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోందన్నారు. శ్రీను కొత్త కుర్రాడైనా అనుభవం కలిగిన డైరెక్టర్‌లా కథను డీల్ చేశాడని కొనియాడారు. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
 
చిత్ర దర్శకుడు శ్రీను ఇమంది మాట్లాడుతూ.. 'మంచి కంటెంట్‌తో సినిమాను తెర‌కెక్కించాం. ఇంజనీరింగ్ చ‌దువుకుంటోన్న న‌లుగురు విద్యార్థుల జీవితాలు ఎలా ఉంటాయి? రెగ్యుల‌ర్‌గా వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ప్రియురాలి ప్రేమ గొప్పదా త‌ల్లిదండ్రుల ప్రేమ గొప్పదా? అనే అంశాల‌కు హాస్యం, సెంటిమెంట్ జోడించి అన్ని వ‌ర్గాల ప్రేక్షకులకు క‌నెక్ట్ అయ్యే విధంగా తెర‌కెక్కించాం. ముఖ్యంగా యువ‌త‌ను టార్గెట్ చేసే సినిమా అవుతుంది' అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మాయం... క్రిమినల్ చర్యలు తప్పవు : మంత్రి నాదెండ్ల

ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులు... బలైపోయిన మెదక్ జిల్లా వ్యక్తి

ఆప్ ఎంపీపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా!

Sandhya Theatre Stampede: పుష్ప-2.. సంధ్య థియేటర్ తొక్కిసలాట- శ్రీతేజ్ బ్రెయిన్ డెత్

తూర్పు నౌకాదళ కేంద్రం : ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక ప్రత్యేకతలేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments