Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'శ్రీమంతుడు' చిత్రాన్ని 70 సార్లు చూసిన డీజీపీ ఎవరు?

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా, ఈ చిత్రాన్ని చూసిన పలువురు ప్రముఖులు పలు గ్రామాలను దత్తత తీసుక

Advertiesment
AP DGP Nanduri Sambasiva Rao
, గురువారం, 31 ఆగస్టు 2017 (10:45 IST)
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా, ఈ చిత్రాన్ని చూసిన పలువురు ప్రముఖులు పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అంతేనా అనేక మంది అనేక సార్లు ఈ చిత్రాన్ని చూశారు. అలా రాష్ట్ర డీజీపీ ఈ చిత్రాన్ని ఏకంగా 70 సార్లు చూశారట. ఆ డీజీపీ ఎవరో కాదు... నండూరి సాంబశివరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ. 
 
గుంటూరులో శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పోలీసు కుటుంబాల విద్యార్థులకు డీజీపీ ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, శ్రీమంతుడు చిత్రంలో చివర్లో జగపతిబాబు చెప్పే ఓ డైలాగు తనకు బాగా ఇష్టమన్నారు. 
 
"అందరూ వాడు పుట్టాడ్రా, వీడు పుట్టాడ్రా అంటారుగానీ, మంచోడు పుట్టాడ్రా నాకు" అన్న డైలాగ్‌ను చెప్పారు. విద్యార్థులు తమను తాము దిద్దుకోవాలని పిలుపునిచ్చారు. మత్తుకు తమ పిల్లలు బానిసలు కావడం పట్ల వారి తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉంటుందని అన్నారు. 
 
పోలీసులు సాధారణంగానే కఠినంగా ఉంటారని, వారి విధి నిర్వహణా బాధ్యతలు అటువంటివని చెప్పారు. పోలీసులు తమ పిల్లల్ని మిగతావారికన్నా అత్యుత్తమంగా పెంచాలని పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్జున్ రెడ్డి లిప్ లాక్ సీన్లన్నీ.. పెన్ డ్రైవ్‌లో కాపీచేసి తాతయ్యకు ఇస్తే "చిల్'' అవుతారు