Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె కోసం ఫ్యామిలీనే వదిలేసా... ఎవరేమనుకుంటే ఏంటి?? స్వాతినాయుడు భర్త

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (15:20 IST)
యూట్యూబ్ సంచలన తార స్వాతినాయుడు గతకొన్నాళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న తన స్నేహితుడు అవినాష్‌ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ కలిసి ఓ మీడియా ఛానల్‌కి ఇంటర్వ్యూ కూడా ఇస్తూ... తాము ఎందుకు పెళ్లి చేసుకున్నాం? తమ వివాహానికి ఎదురైన అడ్డంకులు ఏమిటి.. తదితర విషయాలన్నింటినీ మీడియాతో పంచుకున్నారు. ఇక స్వాతి నాయుడు గతం గురించి తెలిసి తమ పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని.. వాళ్లు లేకుండా పెళ్లి చేసుకోవడం లోటుగా అనిపించింది అన్నారు స్వాతి నాయుడు భర్త అవినాష్.
 
అవినాష్ మాట్లాడుతూ.. 'మా పెళ్లి కూడా అందరి పెళ్లిళ్లలాగే జరిగింది. నేను అనుకున్నట్టే చాలా బాగా జరిగింది. మా ఫ్యామిలీ నా పెళ్లికి రాకపోవడం ఒక్కటే లోటుగా కనిపించింది. ఆమె నాకు నచ్చడానికి కారణం మేం ఇద్దరం మంచి ఫ్రెండ్స్. తర్వాత రిలేషన్‌లో ఉన్నాము. సొసైటీ ఏం అనుకున్నా పర్లేదు అనుకున్నా. తన వీడియోలు, సినిమాలు, రొమాన్స్ సీన్లు ఇలా ఏం చేసినా ఆమె ఆన్ కెమెరా ముందే చేస్తుంది.. ముందొకటి వెనకొకటి చేయదు. 
 
స్వాతినాయుడు కోసం నా ఫ్యామిలీ మెంబర్స్‌నే వదిలేసుకున్నా.. అలాంటిది ఎవరో ఏదో అనుకుంటారంటే పట్టించుకోవడం వదిలేసాను. తనేంటో నాకు తెలుసు. అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకున్నాము. మా పెళ్లి విషయంలో నా తమ్ముడు కూడా చివర్లో డమ్కీ ఇచ్చాడు. పెళ్లి వరకూ నాతో బాగానే ఉన్నాడు తర్వాత రివర్స్ అయ్యాడు. మా పెళ్లి ఆపడానికి ప్రయత్నాలు చేశారు. నేను డబ్బుని అసలు నమ్మను. డబ్బుకి కాదు.. మనిషికి ప్రాధాన్యత ఇస్తాను. నాకు కట్నం ఇస్తా అన్నా వద్దన్నాను అంటూ చెప్పుకొచ్చారు అవినాష్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments