Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో బ్రేకప్ అయిన స్టార్ హీరోయిన్...

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (15:18 IST)
గత కొద్ది కాలంగా వెండి తెరకు దూరంగా ఉన్న అందాల తార శ్రుతి హాసన్ కాటమ రాయుడు సినిమా తర్వాత వేరే ఏ సినిమాలో కనిపించలేదు. లండన్‌కు చెందిన మైఖేల్ కోర్సలేతో ప్రేమ వ్యవహారం కారణంగా ఆమె సినిమాలకు దూరం కావాలని నిర్ణయించుకుని, పలు అవకాశాలకు నో చెప్పినట్లు సినీ వర్గాల్లో చర్చలు జరిగాయి. ఇటీవల శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల చూస్తే అంతర్లీనంగా ఏదో అర్థం ధ్వనిస్తున్నట్లు పలు అనుమానాలు తలెత్తున్నాయి. 
 
సినిమా అవకాశాలతో కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు శ్రుతి 2017లో సినిమాలలో నటించడం మానేసింది. అప్పటి నుండి బుల్లి తెర షోలు, సంగీత ఆల్బమ్‌లు చేసుకుంటూ బిజీగా గడుపుతోంది. ప్రియుడు మైఖేల్ కోర్సలేని వివాహం చేసుకోబోతున్నట్లు అప్పటిలో వార్తలు కూడా వచ్చాయి. అడపాదడపా వీరిద్దరూ ఈవెంట్స్‌లో, పలు ప్రదేశాలలో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. 
 
ఈ మధ్యకాలంలో మళ్లీ దక్షిణాది సినిమాలలో నటించడానికి రెడీ అయ్యి, కొత్త సినిమా స్క్రిప్ట్‌లను పరిశీలిస్తోందట. ఎన్నో రోజులుగా అనుకుంటున్న మంచి పని నా విషయంలో జరిగిపోయింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీ. అదృష్టం నా వెన్నంటే ఉంది. దైవాశీస్సులు నాపై కురిసాయి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు శ్రుతి. మైఖేల్‌తో జరిగిన బ్రేకప్ గురించే ఈ పోస్ట్ పెట్టిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆమెతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటా..: రన్యారావు భర్త జతిన్

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments