Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్తీక్ అదృశ్యం!

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (10:10 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సహాయ దర్శకుడు కనిపించకుండా పోయారు. ఆయన పేరు కార్తీక్ (24). కార్తీక్ అదృశ్యంపై ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల మేరకు... యూసుఫ్‌గూడ మధురానగర్‌కు చెందిన కార్తీక్ (24) టాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 20న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన కార్తీక్ ఆ తర్వాతి రోజు బయలుదేరి నగరానికి చేరుకున్నాడు. అయితే, ఇంటికి వెళ్లకుండా నేరుగా మాదాపూర్‌లోని స్నేహితుల వద్దకు వెళ్లాడు.
 
ఆ తర్వాత స్నేహితులతో కలిసి పంజాగుట్ట చేరుకున్న కార్తీక్ ఇంటికి తిరిగి వెళ్లలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే అది స్విచ్చాఫ్ అని వచ్చింది. ఆ తర్వాత అతని కోసం విస్తృతంగా గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో కార్తీక్ తండ్రి ఉత్తరాది లక్ష్మీనారాయణ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కార్తీక్ ఇటీవల తన స్నేహితులు వంశీ, క్రాంతి, నివాస్ తదితరులతో కలిసి ఓ టీవీ చానల్‌లో కార్యక్రమం కోసం రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టించాడని, ఆ తర్వాత స్నేహితుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆందోళనకుగురై ఎటో వెళ్లిపోయి ఉంటాడని లక్ష్మీనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments