Publish Date: Sat, 21 Nov 2020 (10:05 IST)
Updated Date: Sat, 21 Nov 2020 (10:06 IST)
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 925 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,077 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 50,92,689కి చేరింది.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌ని రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,62,653కి చేరింది. తాజాగా 1,367 మంది మహమ్మారి నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 2,49,157 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.
తాజాగా కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,426కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,070 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. 9,714 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
సెల్వి
Publish Date: Sat, 21 Nov 2020 (10:05 IST)
Updated Date: Sat, 21 Nov 2020 (10:06 IST)