Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రుతిహాసన్‌కు ఏమైంది..? విజయ్ సేతుపతికి పేకప్ చెప్పేసిందా?

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (22:45 IST)
విశ్వనటుడు, దశావతారం హీరో కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్ వార్తల్లో నిలిచింది. గబ్బర్ సింగ్ భామ అయిన శ్రుతిహాసన్ తమిళ సినిమా షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయిందనే వార్త ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. తమిళ్‌లో విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'లాభం' అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది శ్రుతిహాసన్.
 
కరోనా ప్రభావం తగ్గుతోన్న నేపథ్యంలో ఎస్పీ జగన్నాథన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ధర్మగిరి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ హీరోహీరోయిన్లతో పాటు కొందరు ముఖ్య నటీనటులతో క్లైమాక్స్ పార్ట్ చిత్రీకరిస్తున్నారు. 
 
అయితే ఈ సినిమా షూటింగ్ ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు విజయ్‌-శ్రుతిహాసన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చారు. దీంతో హీరోయిన్ శ్రుతిహాసన్‌ షూటింగ్‌ మధ్యలోనే పేకప్ చెప్పేసి సెట్‌ నుంచి వెళ్లిపోయారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్న కారణంగానే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. 
 
కాగా దక్షిణాది స్టార్ హీరోయిన్ అయిన శ్రుతి హాసన్ దక్షిణ అన్ని భాషల్లో అవకాశాలు అందుకుని బిజీ బిజీగా గడుపుతుంది. తెలుగులో శృతి హాసన్ ఎన్నో సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎందరో హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. 
 
వీటిలో చాలా వరకు హిట్లే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో రవితేజ, పవన్ కళ్యాణ్ సినిమాలను చేస్తోంది శ్రుతి హసన్. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ సేతుపతి సినిమా షూటింగ్ నుంచి మధ్యలో పేకప్ చెప్పేయడంపై చర్చ మొదలైంది. దీనిపై శ్రుతి ఏమంటుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

29న వైజాగ్‌కు రానున్న ప్రధాని మోడీ.. ముమ్మరంగా ఏర్పాట్లు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments