Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్ హోటల్‌ మదీనా గూడ బ్రాంచ్‌ను ప్రారంభించిన అశోక్ గల్లా, మానస వారణాసి

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (17:16 IST)
Ashok Galla, Manasa Varanasi, Dinesh, Shrestha
రుచికరమైన ఆహారం కోసం మనుషులంతా వెతుకుతుంటారు. శుచి, శుభ్రత పాటిస్తూ రుచికరమైన భోజనం అందించే రెస్టారెంట్లు, హోటళ్లు అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో బాబాయ్ హోటల్ ముందుంటుంది. విజయవాడలోని బాబాయ్ హోటల్‌కు ఉన్న విశిష్ణత గురించి అందరికీ తెలిసిందే. బాబాయ్ హోటల్‌ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. అంతకంతకూ బ్రాంచ్‌లు పెంచుకుంటూ వెళ్తోన్న బాబాయ్ హోటల్ ఇప్పుడు మదీనా గూడకు వచ్చింది. బాబాయ్ హోటల్ మదీనా గూడ బ్రాంచ్‌ను యంగ్ హీరో అశోక్ గల్లా, మిస్ ఇండియా మానస వారణాసి ప్రారంభించారు. 
 
మహేష్ బాబు మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన అశోక్ గల్లా తన మొదటి చిత్రం ‘హీరో’తో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక 2020లో మిస్ ఇండియాగా ఎంపికైన మానస వారణాసి ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మానస, అశోక్ గల్లా కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి మదీనా గూడలోని బాబాయ్ హోటల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ జంట సందడి చేసింది. వీరితో పాటుగా మరి కొంత సినీ ప్రముఖులు కార్యక్రమానికి విచ్చేశారు.
 
గత ఎనిమిది దశాబ్దాలుగా బాబాయ్ హోటల్ ఎంతో నాణ్యతతో భోజనాన్ని అందిస్తూ వస్తోంది. భోజన ప్రియులకు బాబాయ్ హోటల్ అనేది ఓ అడ్డాలా మారిపోయింది. బాబాయ్ హోటల్‌ను మదీనాగూడలో ప్రారంభించిన అశోక్ గల్లా, మానసలు యాజమాన్యమైన దినేష్, శ్రేష్టకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments