Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 31న అర్జున ఫల్గుణ

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (23:23 IST)
Sri Vishnu, Amrita Iyer
శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. నూతన సంవత్సరం సందర్బంగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని అందించేందుకు సిద్దమైంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో శ్రీవిష్ణు, అమృతా అయ్యర్‌లతో పాటు మిగిలిన నటీనటులు కనిపిస్తున్నారు. త్వరలో చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. 
 
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ప్రియదర్శన్ బాల సుబ్రమణియన్ స్వరపరిచిన పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 
 
ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ చీకటి.. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. 
 
ఈ చిత్రంలో శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

2024 టీడీపి నో మోర్, జనసేన పరార్, రోజా ఇలా అనేశారేంది రాజా? (video)

మాజీ సీఎం జగన్ తాడేపల్లి ఇంటి ముందు రోడ్డు ద్వారా Live View (video) చూసేద్దాం రండి

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments