Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ దర్శకుడికి షాక్... తీసిన సినిమానంతా పడేసి కొత్తగా రీషూట్

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (11:53 IST)
విజయ్ దేవరకొండకు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమా తెలుగునాట సంచలన విజయం సాధించడంతో అనేక భాషలలో దీనిని రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా డైరెక్టర్ బాలా దర్శకత్వంలో రూపొందుతోంది. దీనికి  'వర్మ' అనే టైటిల్‌‌ను ఖరారు చేసి, కొంత కాలం క్రితం టీజర్‌ను విడుదల చేసారు. 
 
దీనికి అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. తెలుగు సినిమా అయినప్పటికీ చాలామంది తమిళ ప్రేక్షకులు కూడా అర్జున్ రెడ్డి సినిమాను చూసినందున వారిని ధృవ్ ఆకట్టుకోలేకపోయాడని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు తీసిన ఫుటేజీని పడేసి మల్లీ కొత్త టెక్నీషియన్స్‌తో రీ షూట్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. 
 
హీరో తప్ప మిగిలిన అందరినీ మారుస్తున్నట్లు ప్రకటించారు. బాలా డైరెక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫైనల్ ఔట్‌పుట్‌పై నిర్మాతలు అసంతృప్తిగా ఉండటమే దానికి కారణం. దీని వలన ఖర్చు ఎంతో పెరిగినప్పటికీ తెలుగులో అర్జున్ రెడ్డి స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో దీనిని పూర్తిగా రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. మంచి పేరున్న దర్శకులలో ఒకరైన బాలా దీన్ని ఎలా తీసుకున్నారో మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

తిరుమల బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారం.. పిల్లి చిక్కలేదు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments