ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయాలతో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న కుర్ర హీరో విజయ్ దేవరకొండ. చాలా తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నాడు విజయ్. గీతగోవిందం సినిమా 100 కోట్లు వసూలు చేయడంతో విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్‌ను కూడా బాగా పెంచేసాడు.
తాజాగా విజయ్ మరో మైలురాయిని చేరుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రతి ఏడాది విడుదల చేసే "ఫోర్బ్స్ అండర్ 30" యంగ్ అచీవర్స్ జాబితాలో విజయ్ పేరు కనిపించడం విశేషం. ఫోర్బ్స్ సంస్థ మొత్తం 16 రంగాల్లో యంగ్ అచీవర్స్ జాబితాను విడుదల చేయగా అందులో ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మ్యూజిక్ విభాగంలో విజయ్ దేవరకొండకు టాప్-75లో చోటు దక్కింది.
2018వ సంవత్సరంలో విజయ్ దేవరకొండ 14 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడంతో అతనికి 72వ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇదే విభాగంలో విజయ్‌తో పాటు యూట్యూబర్ ప్రజక్తా కోలి, గాయని మేఘనా మిశ్రాలకు కూడా చోటు దక్కింది. ఏదేమైనా ఇంత తక్కువ కాలంలో ఫోర్బ్స్ జాబితాలో పేరు దక్కించుకోవడం విశేషమే.