Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవ‌న్ క‌ళ్యాణ్`హ‌రిహ‌ర‌..`లో అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫిక్స్‌

Webdunia
శనివారం, 29 మే 2021 (20:21 IST)
Arjun Rampal, Jacqueline
పవ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్న చారిత్రాత్మ చిత్రం `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. ఎ.ఎం.ర‌త్నం నిర్మాత‌. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇది సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. ఈలోగా కోవిడ్ లాక్‌డౌన్ రావ‌డంతో షూటింగ్ వాయిదా ప‌డింది. తాజాగా ఈ సినిమా గురించి ఎ.ఎం.ర‌త్నం ఇంట‌ర్వ్యూలో వివ‌ర‌ణ ఇచ్చారు. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇప్ప‌టికే బాలీవుడ్ న‌టీన‌టులు ఎవ‌రా? అంటూ వ‌స్తున్న చ‌ర్చ‌కు దీనితో ఫుల్‌స్టాప్ ప‌డింది.
 
ఇక ఇందులో ఔరంగ‌జేబ్ పాత్ర‌లో అర్జున్ రాంపాల్ క‌నిపించ‌నుండ‌గా 17వ శ‌తాబ్ధ‌పు మొఘ‌ల్ రాణిగా జాక్వెలిన్ క‌నిపించ‌నుంది. చిత్ర షూటింగ్ 50 శాతం పూర్తి కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు వారు పాల్గొన‌లేదు. త‌ర్వాతి షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుండ‌గా, ఆ షెడ్యూల్‌లో అర్జున్, జాక్వెలిన్ పాల్గొంటార‌ని ఏఎం ర‌త్నం తెలిపారు. తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా అంతా సెటిల్ అయ్యాక షూట్ ను స్టార్ట్ చేయనున్నారని ఆయన తెలిపారు. ఇక ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments